Raghav Chadha : చీకట్లో ప్రజాస్వామ్యం – రాఘవ్ చద్దా
మోదీ సర్కార్ నిరంకుశ పాలన
Raghav Chadha : మణిపూర్ కొన్ని నెలలుగా మండుతోంది. హింసోన్మాదంతో రగులుతోంది. బాధ్యత కలిగిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు అటు రాష్ట్రంలో ఇటు కేంద్రంలో కొలువు తీరాయి. కానీ ఇప్పటి వరకు సీఎం కానీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కానీ స్పందించక పోవడం దారుణమన్నారు ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యులు (ఎంపీ) రాఘవ్ చద్దా(Raghav Chadha).
Raghav Chadha Said
సోమవారం పార్లమెంట్ వెలుపల మీడియాతో మాట్లాడారు. ఇప్పటి దాకా ఎలాంటి చర్యలు తీసుకున్నారో సభ సాక్షిగా అన్ని పార్టీలకు చెందిన ఎంపీలు అడిగారని కానీ ప్రధాని ఎందుకు సమాధానం చెప్పలేక పోతున్నారంటూ ఫైర్ అయ్యారు రాఘవ్ చద్దా.
ఈ దేశంలో ప్రజాస్వామ్యం అన్నది చీకట్లో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రోద్భలంతోనే మైనార్టీలపై కావాలని , పనిగట్టుకుని దాడులకు పాల్పడుతున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు ఆప్ ఎంపీ.
ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదంటూ హితవు పలికారు. ఇవాళ ప్రతిపక్షాల నోరు నొక్కవచ్చు..కానీ సత్యం నోరు నొక్కలేరంటూ హెచ్చరించారు రాఘవ్ చద్దా. ఇకనైనా మోదీ మేల్కోవాలని లేక పోతే దేశం క్షమించదని గుర్తు పెట్టుకోవాలన్నారు.
Also Read : DK Shiva Kumar : కాంగ్రెస్ ప్రభుత్వ అస్థిరతకు కుట్ర – డీకే