Raghav Chadha : ఢిల్లీలో నువ్వా నేనా అన్న రీతిలో కొనసాగుతోంది రాజకీయం. ఆప్ పై ఏదో రకంగా పెత్తనం చెలాయించేందుకు మోదీ సర్కార్ యత్నిస్తోంది.
ఢిల్లీలోని జహంగీర్ పూరి అక్రమ నిర్మాణాల కూల్చివేత పేరుతో బుల్డోజర్లను ప్రయోగించడాన్ని తీవ్రంగా తప్పు పట్టాయి ప్రతిపక్షాలు. రాహుల్ గాంధీ ఇది పూర్తిగా విద్వేష పూరిత బుల్డోజర్ల ప్రయోగం అని పేర్కొన్నారు.
ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. దేశం ఓ వైపు ఇబ్బందుల్లో ఉంటే ఇలాంటి పనులు చేపట్టడం మంచి పద్దతి కాదన్నారు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా అయితే తీవ్రంగా తప్పు పట్టారు.
భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులు లంచాలు తీసుకుని అక్రమ కట్టడాలకు పర్మిషన్లు ఇచ్చారంటూ ఆరోపించారు. ముందుగా ఈ బుల్డోజర్లను బీజేపీ నేతలపై,
ప్రధానంగా విషం కక్కుతున్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఇంటిని కూల్చేందుకు ప్రయోగించాలని డిమాండ్ చేశారు. వ్యక్తుల్ని, వ్యవస్థలను, బీజేపీయేతర రాష్ట్రాలను ఇబ్బందులకు గురి చేయడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు.
ఇది ప్రజాస్వామ్యానికి మంచి పద్దతి కాదన్నారు. ఓ వైపు భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం స్టేటస్ కో ఇచ్చిందని అయినా తమకు ఆర్డర్ కాపీలు అందలేదన్న సాకుతో కూల్చి వేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.
కేంద్ర మంత్రి అమిత్ షా స్వయంగా ఈ అల్లర్లను ప్రోత్సహిస్తున్నారంటూ సంచలన కామెంట్స్ చేశారు రాఘవ్ చద్దా(Raghav Chadha). ఆయన ఇంటిని కూల్చేస్తే అల్లర్లు ఆగి పోతాయంటూ పేర్కొన్నారు.
Also Read : జహంగీర్ పురిలో కూల్చివేత నిలిపివేత