Raghav Chadha : చట్టాలను ఉల్లంఘించిన కేంద్రం
ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా కామెంట్స్
Raghav Chadha : ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్య సభ సభ్యులు రాఘవ్ చద్దా సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం ఆమోదించ బడ్డాక ఎటువంటి బిల్లులను ప్రవేశ పెట్ట కూడదని రూల్. దీనిని ప్రత్యేకంగా భారత రాజ్యాంగంలో ప్రస్తావించారు. కానీ ఇప్పటికీ అన్ని నిబంధనలను తుంగలో తొక్కింది మోదీ బీజేపీ సంకీర్ణ సర్కార్ అని ఆరోపించారు రాఘవ్ చద్దా.
Raghav Chadha Said
ఇలా చేయకూడదని రూల్స్ లో స్పష్టంగా పేర్కొన్నా వాటిని ఏవీ పట్టించు కోక పోవడం దారుణమన్నారు. ఇది చాలా విచారకరం. ఇది పార్లమెంటరీ చట్టాన్ని పూర్తిగా ఉల్లంఘించడం తప్ప మరొకటి కాదన్నారు రాఘవ్ చద్దా(Raghav Chadha). 26 ప్రతిపక్షాలకు చెందిన కూటమి ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఇందులో భాగంగా భారత దేశ ప్రతినిధి బృందం మణిపూర్ కు వెళుతుందని వెల్లడించారు.
ఈ మేరకు అక్కడి ప్రజల బాధలను పంచుకుని, పరిస్థితులను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుందన్నారు. తిరిగి వచ్చిన తర్వాత పూర్తి నివేదికను కేంద్ర సర్కార్ కు తెలియ చేస్తుందని స్పష్టం చేశారు రాఘవ్ చద్దా.
85 రోజుల తర్వాత మణిపూర్ హింసోన్మాదంపై కేంద్రం స్పందించడం విడ్డూరంగా ఉందన్నారు. సీబీఐకి అప్పగించడం దారుణమన్నారు ఆప్ ఎంపీ.
Also Read : Bihar BJP Poster Viral : బీహార్ లో మోదీ ఫ్లెక్సీ కలకలం