Raghav Chadha : ప్రమాదంలో ప్రజాస్వామ్యం – రాఘవ్ చద్దా
కేంద్ర సర్కార్ పై నిప్పులు చెరిగిన ఆప్ ఎంపీ
Raghav Chadha : ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా నిప్పులు చెరిగారు. మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడిందని ఆవేదన చెందారు. బీజేపీయేతర ప్రభుత్వాలను పనిగట్టుకుని కక్ష సాధింపులకు దిగుతోందంటూ మండిపడ్డారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు.
Raghav Chadha Comments
ఆప్ సర్కార్ ను కావాలని టార్గెట్ చేస్తూ వస్తున్నారని, చివరకు సుప్రీంకోర్టు సైతం చీవాట్లు పెట్టినా పట్టించు కోలేదని ఆరోపించారు రాఘవ్ చద్దా(Raghav Chadha). మోదీ ప్రభుత్వం పార్లమెంట్ చట్టాలను సైతం ఉల్లంఘిస్తోందని ధ్వజమెత్తారు. ఒకసారి సభ్యులు నోటీసు ఇచ్చిన తర్వాత ఎలాంటి బిల్లులను ప్రవేశ పెట్టకూడదని ఇది రాజ్యాంగంలో పొందు పర్చబడి ఉన్నదని స్పష్టం చేశారు ఎంపీ.
ఢిల్లీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బిల్లును తీసుకు రావడం దారుణమన్నారు. అయినా వీగి పోయే బిల్లుకు ఇంత రాద్దాంతం చేయాల్సిన అవసరం దేనికి అని ప్రశ్నించారు రాఘవ్ చద్దా. ఒక్క లా అండ్ ఆర్డర్ తప్ప ఏ అంశంపై నిర్ణయం తీసుకునేందుకు, సంతకాలు చేసేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ అర్హుడు కాడని సుప్రీంకోర్టు తీర్పు చెప్పినా ఆచరించక పోవడం అప్రజాస్వామికమని మండిపడ్డారు ఎంపీ.
Also Read : KCR Dasoju : దాసోజును మరువని కేసీఆర్