Raghunandan Rao : ఇస్తే తీసుకోండి నన్ను గెలిపించండి
బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు
Raghunandan Rao : దుబ్బాక – భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎలాగైనా గెలవాలని అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి అడ్డమైన దారులు వెతుకుతున్నారంటూ ఆరోపించారు. ఓటుకు రూ. 5 వేలు ఇస్తానంటూ ఓటర్లను మభ్య పెడుతున్నారంటూ ఈ విషయంపై తాను పదే పదే రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు.
Raghunandan Rao Shocking Comments
ప్రభాకర్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిండు. లెక్కకు మించినంత సంపాదించాడని, వాటిని ఎరగా వేసి ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నాడని మండిపడ్డారు. ప్రజలు తన పనితీరును గుర్తించారని, వాళ్లు ఎవరికీ లొంగరన్న సంగతి రాష్ట్ర ప్రజలందరికీ తెలిసి పోయిందన్నారు.
కానీ అక్రమాలకు పాల్పడి, ఓటర్లను మభ్య పెట్టి, మందు పోయించి, డబ్బులతో ప్రభావితం చేసేందుకు కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడంటూ ధ్వజమెత్తారు ఎమ్మెల్యే రఘునందన్ రావు(Raghunandan Rao). తాను ప్రజలకు ఒక్కటే విన్నవిస్తున్నానని, ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండని, కానీ ఓటు మాత్రం తనకు వేసి గెలిపించాలని కోరారు.
Also Read : Rashid Latif : పాక్ క్రికెటర్లకు జీతాలు లేవు