Raghunandan Rao : గ‌ద్ద‌ర‌న్న‌కు ర‌ఘునంద‌న్ నివాళి

తెలంగాణ సంప‌దత్వం గ‌ద్ద‌ర్ గానం

Raghunandan Rao : ప్రజా యుద్ద నౌక గ‌ద్ద‌ర్ కు నివాళులు అర్పించారు బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు ర‌ఘునంద‌న్ రావు(Raghunandan Rao). కుటుంబీకుల‌ను ప‌రామ‌ర్శించారు. సిద్దాంతాలు వేరైనా అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల గుండెల్ని త‌న ఆట‌, పాట‌ల‌తో చైత‌న్య‌వంతం చేసిన గాయ‌కుడు గ‌ద్ద‌ర్ అని కొనియాడారు. ఇవాళ ఆయ‌న తెలంగాణ స‌మాజానికే కాదు యావ‌త్ ప్ర‌పంచానికి తీర‌ని లోటును మిగిల్చి వెళ్లాడ‌ని పేర్కొన్నారు.

Raghunandan Rao Paid Tributes To Gaddar

కొన్ని త‌రాల పాటు , కొన్ని ద‌శాబ్దాల పాటు గ‌ద్ద‌ర్ త‌న పాట‌ల‌తో ప్ర‌భావితం చేస్తూ వ‌చ్చాడ‌ని అన్నారు. పేద‌లు, అణ‌గారిన వ‌ర్గాలకు ఆర్తి గీతంగా నిలిచిన ప్ర‌జా గాయ‌కుడు లేక పోవడం బాధాక‌ర‌మ‌ని వాపోయారు ర‌ఘునంద్ రావు.

జ‌నం కోసమే బ‌తికి, ప్ర‌జ‌ల కోసం పాడే గాయ‌కులు అరుదుగా జ‌న్మిస్తార‌ని, ఒక చ‌రిత్ర‌కు ద‌ర్ప‌ణంగా నిలిచిన గ‌ద్ద‌ర్ ఎల్ల‌ప్ప‌టికీ బ‌తికే ఉంటార‌ని తెలిపారు. ఒక యుగానికి స‌రిప‌డా త‌న ప్ర‌భావాన్ని మిగిల్చి పోయిన ప్ర‌జా యుద్ద‌నౌక‌కు విన‌మ్రంగా నివాళి అర్పిస్తున్నాన‌ని స్ప‌ష్టం చేశారు దుబ్బాక ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్ రావు.

తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మ గౌర‌వానికి ప్ర‌తీకగా గ‌ద్ద‌ర్ త‌న వాయిస్ నిలిచి పోతుంద‌న్నారు. పార్టీలకు అతీతంగా, సిద్దాంతాల‌కు అతీతంగా ఎవ‌రైనా స‌రే ప్ర‌జా గాయ‌కుడిని గౌర‌విస్తార‌ని, ప్రేమిస్తార‌ని తెలిపారు.

Also Read : Paritala Sriram : గ‌ద్ద‌ర‌న్న బ‌తికే ఉంటాడు – శ్రీ‌రామ్

Leave A Reply

Your Email Id will not be published!