Raghuram Rajan : రఘురాం రాజన్ తో సీఎం భేటీ
ఆర్బీఐ మాజీ గవర్నర్ పలు సూచనలు
Raghuram Rajan : హైదరాబాద్ – రాష్ట్రంలో కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడు పెంచింది. ఇప్పటికే అస్తవ్యస్తంగా మారిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే మరింత వేగం పెంచారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి. ఈ మేరకు ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను ప్రకటించింది.
Raghuram Rajan Met with CM Revanth Reddy
ఇప్పటికే 2 హామీలను అమలు చేస్తోంది. ఇందులో ఒకటి మహాలక్ష్మి పథకం కింద ఉచితంగా మహిళలకు బస్సుల్లో ప్రయాణం. రెండో గ్యారెంటీ కింద ఆరోగ్య శ్రీ పథకం లో భాగంగా వైద్య ఖర్చుల పరిమితిని రూ. 10 లక్షలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు సీఎం.
ఇదే సమయంలో ఇప్పటికే రూ. 5,00,000 కోట్లకు పైగా రాష్ట్ర ఖజానాపై భారం పడింది. ఎక్కువగా విద్యుత్ శాఖతో పాటు పౌరసరఫరాలు, ఇతర శాఖలు సైతం అప్పుల్లో కూరుకు పోయాయని తేలింది సీఎం సమీక్షల్లో.
ఇందులో భాగంగా భారత దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యుత్తమమైన ఆర్థికవేత్తగా గుర్తింపు పొందిన ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్(Raghuram Rajan) తో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఉన్నారు.
ఈ సందర్భంగా ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఆర్థికాభివృద్దికి సంబంధించి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.
Also Read : Revanth Reddy CM : కేసీఆర్ నిర్వాకం రాష్ట్రం నాశనం