Raghuram Rajan : ఆర్థిక వ్యవస్థపై రాజన్ కామెంట్స్
చైనాను భారత్ భర్తీ చేయడం కష్టం
Raghuram Rajan : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ చీఫ్ రఘురామ్ రాజన్(Raghuram Rajan) షాకింగ్ కామెంట్స్ చేశారు. చైనాను భారత్ భర్తీ చేస్తుందని అనుకోవడం కష్టమని పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక వృద్దిని ప్రభావితం చేసే విషయంలో చైనాను భారత్ భర్తీ చేస్తుందని అనుకోవడం తప్పని పేర్కొన్నారు.
ఏది ఏమైనప్పటికీ భారతదేశం ఇప్పటికే ప్రపంచంలో ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నందున అది వృద్ది చెందుతోందని, ఇదే సమయంలో విస్తరిస్తూనే ఉండే అవకాశం ఉన్నందున పరిస్థితి ముందుకు సాగవచ్చని తెలిపారు. ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యుఇఎఫ్) ఇటీవల విడుదల చేసిన చీఫ్ ఎకనామికస్ట్ ఔట్ లుక్ పై మీడియాతో మాట్లాడారు రఘురామ్ రాజన్.
2023లో గ్లోబల్ మాంద్యాన్ని అంచనా వేస్తున్న వారిలో ఎక్కువ మంది, చైనా ఆర్థిక వ్యవస్థలో ఏదైనా పునరుద్దరణ ఖచ్చితంగా ప్రపంచ వృద్ది అవకాశాలను పెంచుతుందని రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు. ఈ సమయంలో విధాన రూపకర్తలు లేబర్ మార్కెట్ తో పాటు హౌసింగ్ మార్కెట్ ను కూడా చూస్తున్నారని తెలిపారు. అమెరికాను ప్రస్తావించారు.
అక్కడ గృహాల విక్రయాలు జరగడం లేదన్నారు. అయితే ధరలు తగ్గడం లేదని కుండ బద్దలు కొట్టారు రఘురామ్ రాజన్(Raghuram Rajan). ఇదంతా అంధకారం, వినాశనమా బహుశా కాదు పుతిన్ యుద్దాన్ని ముగించాలని నిర్ణయించుకుంటే ఖచ్చితంగా తలక్రిందులు అవడం ఖాయమన్నారు.
ఇంకా 12 నెలల సమయం ఉందని, చైనా బాగుపడితే బాగుంటుందని పేర్కొన్నారు రఘురామ్ రాజన్. భారత దేశం చాలా చిన్న ఆర్థిక వ్యవస్థగా ఉందన్నారు.
Also Read : నోరు మూసేందుకు లంచం ఇచ్చారు