Raghuram Rajan : దివాలా తీసేలా ఉచితాలు ఉండొద్దు
ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్
Raghuram Rajan : న్యూఢిల్లీ – రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురాం రాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ప్రభుత్వాలు పదే పదే ఇస్తున్న ఉచిత హామీలు అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు. శనివారం రఘురాం రాజన్(Raghuram Rajan) మీడియాతో మాట్లాడారు.
Raghuram Rajan Comment
అయితే ఉచితాలు లేదా సంక్షేమ పథకాలు మంచి లక్ష్యాన్ని కలిగి ఉన్నంత దాకా హనికరం కాదని పేర్కొన్నారు. అయితే వాటి నుండి అర్థవంతమైన ప్రయోజనాలను పొందగల వ్యక్తులపై సానుకూల ప్రభావాలను అందిస్తాయని స్పష్టం చేశారు మాజీ గవర్నర్.
ప్రజలకు నగదు బదిలీలు నిరుపేద కుటుంబాలకు ఇవ్వడం సరైనదేనని పేర్కొన్నారు. అయితే ఉచిత పథకాలను చాలా మటుకు తగ్గించాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రత్యేకించి సంక్షేమ పథకాలు పిల్లలకు పౌష్టిక ఆహారం అందించడం, పాఠశాలలకు చదువు కునేందుకు మార్గం ఏర్పడుతుందని పేర్కొన్నారు రఘురాం రాజన్.
ఇలాగే ఉచితాలు ఇచ్చుకుంటూ పోతే భవిష్యత్తులో దేశం, రాష్ట్రాలు దివాలా తీస్తాయని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. దీనిని తగ్గించాలని, మౌలిక సదుపాయాల కల్పనపై ఎక్కువగా ఫోకస్ పెట్టాలన్నారు.
Also Read : CPI Ramakrishna : అంగన్ వాడీల వేతనాలు పెంచాలి