Raghuram Rajan : ఆర్థిక వ్యవస్థకు రాజన్ చికిత్స
తెలంగాణ సర్కార్ కు
Raghuram Rajan : హైదరాబాద్ – ప్రపంచ ప్రఖ్యాత ఆర్థికవేత్త , రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను ప్రత్యేకంగా ఆహ్వానించింది. ఇందులో భాగంగా హైదరాబాద్ కు విచ్చేసిన ఆయనకు ఘన స్వాగతం పలికారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి.
Raghuram Rajan Special Role
సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, శాసన వ్యవహారాలు, ఐటీ శాఖల మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ శాంతి కుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం కార్యదర్శి శేషాద్రి ఉన్నారు.
ఈ సందర్భంగా సుదీర్ఘంగా చర్చించారు రఘురామ్ రాజన్(Raghuram Rajan). ప్రస్తుతం రాష్ట్ర ఖజానాపై ఏకంగా రూ. 5,00,000 కోట్లు అప్పులుగా ఉన్నాయని వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి. వీటిని అధిగమించడం ఒక సవాల్ గా మారిందని, ఇదే సమయంలో తమ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలంటే తలకు మించిన భారం అవుతుందని తెలిపారు.
వీటి నుంచి గట్టెక్కేందుకు విలువైన సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా కోరారు రేవంత్ రెడ్డి. సమీక్షలో భాగంగా రఘురామ్ రాజన్ ఉచితాలపై కీలక వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. పేదలకు ఇవ్వడం మంచిదేనని, అయితే వాటిని ఎక్కువగా పౌష్టికాహారం, వైద్యం, విద్యా రంగాలపై ఖర్చు చేస్తే బావుంటుందని సూచించారు.
మొత్తం మీద రఘురామ్ రాజన్ రాకతో ప్రభుత్వం సంతోషానికి గురైంది. ఆనందం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి.
Also Read : Raghuram Rajan : రఘురాం రాజన్ తో సీఎం భేటీ