Rahul joshimath : జోషిమ‌ఠ్ ప‌రిస్థితిపై రాహుల్ ఆందోళ‌న

ప్ర‌కృతికి విరుద్దంగా ప‌నులు చేప‌ట్టారు

Rahul joshimath : జోషిమ‌త్ లో భూమి కుంగి పోవ‌డం తో అక్క‌డి ప్ర‌జ‌లు తీవ్ర ఆందోళ‌న‌కు గురి కావ‌డంపై ఆవేద‌న వ్య‌క్తం చేశారు కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు రాహుల్ గాంధీ(Rahul joshimath). త‌న‌ను తీవ్రంగా క‌లిచి వేసింద‌న్నారు. ప‌ర్వ‌తాల‌పై నిరంత‌రం త్ర‌వ్వ‌డం, ప్ర‌ణాళికేత‌ర నిర్మాణాలు చేప‌ట్ట‌డం వ‌ల్ల ఇలాంటి ఉప‌ద్ర‌వాలు వ‌స్తున్నాయ‌ని పేర్కొన్నారు. ప్ర‌కృతికి విరుద్దంగా న‌డ‌వ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. వీటి కార‌ణంగా అక్క‌డి వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని పేర్కొన్నారు రాహుల్ గాంధీ.

ఈ చ‌లిలో ఈ విప‌త్తు ప్ర‌జ‌ల ఇళ్ల‌ను తీసుకు వెళ్లింద‌న్నారు. ఉత్త‌రాఖండ్ లోని జోషి మ‌ఠ్ లో వంద‌లాది ఇళ్ల‌కు ప‌గుళ్లు వ‌చ్చాయ‌ని అన్నారు. ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న దుస్థితికి పాల‌కులే కార‌ణ‌మ‌ని ఆరోపించారు రాహుల్ గాంధీ. ఈ చ‌ల్ల‌ని వాతావ‌ర‌ణంలో బాధిత ప్ర‌జ‌ల‌ను జాగ్ర‌త్త‌గా చూసుకోవాల‌ని , వారికి భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వానికి కోరారు.

మీడియాతో మాట్లాడిన రాహుల్ గాంధీ(Rahul joshimath) ప్ర‌త్యేకంగా జోషి మ‌ఠ్ గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. అక్క‌డి నుండి వ‌స్తున్న చిత్రాలు అత్యంత భ‌యాన‌కంగా ఉన్నాయి. నేను తీవ్ర మ‌నోవేద‌న‌కు గుర‌య్యాను. ఇళ్ల‌ల్లో విశాల‌మైన ప‌గుళ్లు, నీరు కార‌డం, భూమిలో ప‌గుళ్లు , రోడ్లు క్షీణించ‌డం చాలా ఆందోళ‌న క‌లిగిస్తోంద‌న్నారు.

భ‌గ‌వ‌తీ ఆల‌యంలో కొండ చ‌రియ‌లు విరిగి ప‌డ‌డం మ‌రింత ఇబ్బంది పెట్టేలా ఉంద‌న్నారు రాహుల్ గాంధీ. ఈ క‌ఠినమైన వాతావ‌ర‌ణంలో ప్ర‌జ‌లకు పునరావాసం క‌ల్పించాల‌ని కోరారు.

మ‌రో వైపు ఉత్త‌రాఖండ్ సీఎం పుష్క‌ర్ సింగ్ ధామీ ఘ‌ట‌నా స్థ‌లానికి వెళ్లారు.

Also Read : అయోధ్య‌కు రాహుల్ ను పిలుస్తాం

Leave A Reply

Your Email Id will not be published!