Rahul Gandhi : భ్రష్టుపట్టిన పాలక వ్యవస్థపై పారాటం
తప్పదన్న ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్
Rahul Gandhi Ruling Dispensation : ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ షాకింగ్ కామెంట్స్ చేశారు. దేశంలో పాలనా వ్యవస్థ పూర్తిగా దారి తప్పిందన్నారు. లండన్ లో కాంగ్రెస్ అగ్ర నాయకుడు మాట్లాడిన మాటలు కలకలం రేపుతున్నాయి. ఈ దేశంలో అన్ని వ్యవస్థలు దుర్వినియోగం అవుతున్నాయని దీనికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కారణమన్నారు. ప్రస్తుతం ప్రజాస్వామ్యం అన్నది లేకుండా పోయిందని, ఇది పూర్తిగా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారిందని ఆరోపించారు రాహుల్ గాంధీ(Rahul Gandhi Ruling Dispensation).
వ్యవస్థలను నిర్వీర్యం చేయడం ద్వారా పూర్తిగా తమ కంట్రోల్ లోకి తీసుకు రావాలని అదానీ , అంబానీ లాంటి వ్యాపారవేత్తలు పకడ్బందీగా ప్లాన్ చేశారంటూ మండిపడ్డారు. ఆనాడు ఆర్ఎస్ఎస్ విషయంలో ప్రశ్న తలెత్తినప్పుడు మహాత్మా గాంధీ దానిని అంతర్గత సమస్యగా పేర్కొన్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అందుకే తాము భ్రష్టు పట్టిన పాలనపై పోరాటం చేస్తున్నామని స్పష్టం చేశారు రాహుల్ గాంధీ.
తాను చేపట్టిన భారత్ జోడో యాత్ర ఇప్పుడు దేశానికి దిశా నిర్దేశం చేసే స్థాయికి చేరుకుందున్నారు. ప్రజలు విడి పోకుండా చేసేలా చేయడంలో కీలక పాత్ర పోషించామన్నారు కాంగ్రెస్ అగ్ర నాయకుడు. లండన్ లోని ఇండిపెండెంట్ పాలసీ ఇన్ స్టిట్యూట్ చతం హౌస్ లో జరిగిన సంభాషణలో కీలక వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ(Rahul Gandhi).
కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు భారత దేశం మొత్తం విస్తరించిన తన యాత్ర ప్రతిఘటనకు కొత్త కోణాన్ని తీసుకు వచ్చేలా చేసిందని చెప్పారు. ప్రజాస్వామ్యం కుప్ప కూలితే ప్రపంచ ప్రజాస్వామ్యానికి పెను ముప్పు అనిపేర్కొన్నారు.
Also Read : ఆర్ఎస్ఎస్ మతోన్మాద తీవ్రవాద సంస్థ