Rahul Gandhi : విభేదాలు వీడండి ప‌వ‌ర్ లోకి రండి – రాహుల్

క‌న్న‌డ కాంగ్రెస్ నేత‌ల‌కు మాజీ చీఫ్ హిత‌బోధ

Rahul Gandhi : కాంగ్రెస్ మాజీ చీఫ్‌, వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. క‌న్న‌డ నాట ఎలాగైనా స‌రే ఈసారి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగ‌రాల‌ని పిలుపునిచ్చారు.

విభేదాల‌ను వీడండి ముందు క‌లిసిక‌ట్టుగా పార్టీ కోసం ప‌ని చేయండి. ప‌వ‌ర్ లోకి వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నాలు చేయండ‌ని స్ప‌ష్టం చేశారు.

ఇవాళ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ ముఖ్య‌మంత్రి సిద్ద‌రామ‌య్య పుట్టిన రోజు సంద‌ర్భంగా రాహుల్ గాంధీ ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు.

అనంత‌రం పార్టీ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన కీల‌క స‌మావేశంలో మాట్లాడారు. అక్ర‌మంగా అధికారాన్ని చేజిక్కించుకున్న భార‌తీయ జ‌న‌తా పార్టీని గ‌ద్దె దించడ‌మే ల‌క్ష్యంగా ముందుకు సాగాల‌న్నారు రాహుల్ గాంధీ(Rahul Gandhi).

పార్టీకి సంబంధించిన స‌మ‌స్య‌లు ఏవైనా ఉంటే త‌న వ‌ద్ద‌కు తీసుకు రావాల‌ని కానీ బ‌య‌ట‌కు చెప్ప కూడ‌ద‌న్నారు. ఎంతో అనుభ‌వం క‌లిగిన నాయ‌కులు ఉన్నార‌ని , కానీ స‌మ‌న్వ‌యం కొర‌వడిన‌ట్లు అనిపిస్తోంద‌న్నారు.

ఇగోలు ప‌క్క‌న పెట్టి ముందు పార్టీ ప‌టిష్ట‌త కోసం ప‌ని చేయాల‌ని స్ప‌ష్టం చేశారు. మ‌న‌కు కావాల్సినంత టైం ఉంద‌ని డీలా ప‌డ‌కండి అని ఇప్ప‌టి నుంచే పార్టీ శ్రేణుల‌ను కార్యోన్ముఖుల్ని చేసేందుకు స‌మాయ‌త్తం కావాల‌ని కోరారు రాహుల్ గాంధీ.

ఇదిలా ఉండ‌గా రెండు వ‌ర్గాలు గా విడి పోయింది పార్టీ. ఒక వ‌ర్గం సిద్ద‌రామ‌య్య అయితే మ‌రో వ‌ర్గం కేపీసీసీ చీఫ్ డీకే శివ‌కుమార్. ఇద్ద‌రి మ‌ధ్య ఉన్న ఆధిప‌త్య పోరును గుర్తించిన రాహుల్ గాంధీ(Rahul Gandhi) కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

Also Read : రూ. 415 కోల్ల‌ బిల్డ‌ర్ల‌ ఆస్తులు స్వాధీనం

Leave A Reply

Your Email Id will not be published!