Congress Protest : కాంగ్రెస్ ఆందోళన రాహుల్ గాంధీ అరెస్ట్
దేశ రాజధానిలో భారీగా పోలీసుల మోహరింపు
Congress Protest : పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, నిత్యావసర వస్తువులపై జీఎస్టీ పెంపును నిరసిస్తూ శుక్రవారం కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసన చేపట్టింది. ఎంపీలు నల్ల దుస్తులు ధరించి ఆందోళనలో పాల్గొన్నారు.
నిరసన ప్రదర్శన చేపట్టేందుకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపింది కాంగ్రెస్ పార్టీ. పార్లమెంట్ లో మాట్లాడ నీయడం లేదని, బయటకు వస్తే అరెస్ట్ లకు పాల్పడుతున్నారంటూ ఆరోపించింది.
పార్టీ చేపిన భారీ నిరసనలో పాల్గొన్న కాంగ్రెస్(Congress Protest) అగ్ర నాయకుడు రాహుల్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నిరసన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియా గాంధీ , రాహుల్ గాంధీలు నేతృత్వం వహించారు.
ఇవాళ ఎంపీలు నల్ల దుస్తులతో వచ్చి వినూత్న నిరసన తెలిపారు. దర్యాప్తు సంస్థలను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందన్న ఆరోపణలపై కాంగ్రెస్ సభ్యులు తీవ్ర గందరగోళం సృష్టించడంతో రాజ్యసభ కార్యకలాపాలు వాయిదా పడ్డాయి.
ఇదిలా ఉండగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యులు, సీనియర్ నాయకులు పీఎం హౌస్ ఘెరావ్ కు పిలుపునిచ్చారు. కాగా లోక్ సభ , రాజ్యసభ ఎంపీలు పార్లమెంట్ నుండి ఛలో రాష్ట్రపతి భవన్ నిర్వహిస్తామని ప్రకటించారు.
దీంతో ఏం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది ఢిల్లీలో. కాగా రాహుల్ గాంధీ పార్టీ ప్రధాన కార్యాలయం వెలుపల ఇతర కాంగ్రెస్ నేతలతో కలిసి నిరసన తెలుపుతుండగా ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. దేశంలో ప్రజాస్వామ్యానికి మోదీ పాతర వేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు.
Also Read : మోదీ జాతర ప్రజాస్వామ్యానికి పాతర