Rahul Gandhi : చింత‌న్ బైట‌క్ కు రాహుల్ గాంధీ

పార్టీ భ‌విష్య‌త్తుపై కీల‌క చ‌ర్చ‌లు

Rahul Gandhi  : రాబోయే ఎన్నిక‌ల్లో పార్టీని మ‌రింత బలోపేతం చేసేందుకు సుదీర్ఘ రాజ‌కీయ చ‌రిత్ర క‌లిగిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ కీల‌క స‌మావేశానికి వేదిక కానుంది. ఆ పార్టీ ఆధ్వ‌ర్యంలో మూడు రోజుల పాటు చింతన్ శివిర్ (బైట‌క్ ) ఏర్పాటు చేసింది.

ఈ స‌మావేశాలు అత్యంత ప్రాధాన్య‌త సంత‌రించుకున్నాయి. కేంద్ర – రాష్ట్ర సంబంధాలు, ఈశాన్య రాష్ట్రాల ప‌రిస్థితి, జ‌మ్మూ కాశ్మీర్ , మతం పేరుతో చోటు చేసుకుంటున్న ప‌రిణామాల‌పై ప్ర‌ధానంగా చ‌ర్చించ‌నున్న‌ట్లు స‌మాచారం.

న‌వ సంక‌ల్ప్ చింత‌న్ శివిర్ లో పాల్గొనేందుకు ఉద‌య్ పూర్ కు చేరుకున్నారు శుక్ర‌వారం కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi ). రాజ‌స్థాన్ లోని ఉద‌య్ పూర్ లో ఏర్పాట్లు పూర్తి చేశారు.

భారీ ఎత్తున పార్టీకి సంబంధించిన సీనియ‌ర్ నాయ‌కులు, బాధ్య‌తులు , ప్ర‌జా ప్ర‌తినిధులు, పార్టీ ఇన్ చార్జ్ లు పాల్గొన‌నున్నారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల‌న్నీ ఈ చింత‌న్ శివిర్ పైనే ఫోక‌స్ పెట్టాయి.

ఏఐసీసీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ నేతృత్వంలో జ‌రిగే ఈ బైట‌క్ కీల‌కం కానుంది. ఇదిలా ఉండ‌గా రాహుల్ గాంధీ (Rahul Gandhi )విమానంలో కాకుండా రైలులో ప్ర‌యాణం చేశారు.

రైత‌ల స‌మ‌స్య‌లు, రాబోయే ఎన్నిక‌ల కోసం పార్టీని బ‌లోపేతం చేయ‌డంపై చ‌ర్చ‌లు జ‌రుగుతాయ‌ని పార్టీ వ‌ర్గాలు తెలిపాయి. ఈ మేధో మ‌థన సెష‌న్ లో దేశ వ్యాప్తంగా 400 మంది సీనియ‌ర్ కాంగ్రెస్ నేత‌లు పాల్గొంటారు.

2024లో జ‌రిగే ఎన్నిక‌ల్లో బీజేపీకి స‌వాల్ విసిరేందుకు వ్యూహ ర‌చ‌న చేసేందుకు చ‌ర్చ‌లు జ‌ర‌ప‌నున్నారు.

Also Read : రాయ్ పూర్ ఎయిర్ పోర్ట్ లో కూలిన హెలికాప్ట‌ర్

Leave A Reply

Your Email Id will not be published!