Rahul Gandhi : అదానీ వ్యవహారం రాహుల్ ఆగ్రహం
బిలియన్ డాలర్ల డబ్బు ఎవరిదో చెప్పాలి
Rahul Gandhi : వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ప్రశ్నించారు. అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీకి లబ్ది చేకూర్చేలా పీఎం ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నారని ధ్వజమెత్తారు.
Rahul Gandhi Slams PM Modi
రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. అదానీ గ్రూప్ చేస్తున్న మోసాలను బట్ట బయలు చేసిన ప్రముఖ పత్రికలు ఫైనాన్షియల్ టైమ్స్ , ది గార్డియన్ లలో వచ్చిన వార్తలను రాహుల్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీనిపై ఎందుకు నరేంద్ర మోదీ మౌనంగా ఉన్నారో చెప్పాలని నిలదీశారు.
భారత దేశం నుండి ప్రపంచ వ్యాప్తంగా ఒక బిలియన్ డాలర్లకు పైగా డబ్బు విదేశాలకు వెళ్లింది. ఆపై అదే డబ్బులు తిరిగి ఇండియాకు వచ్చాయి. ఈ డబ్బులు ఎవరికి చెందినవో కేంద్ర ప్రభుత్వం , ప్రత్యేకించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పాలని రాహుల్ గాంధీ(Rahul Gandhi) డిమాండ్ చేశారు.
ఇంత భారీ ఎత్తున చోటు చేసుకున్న లావాదేవీల వెనుక ఎవరు ఉన్నారో తెలియాల్సిన అవసరం ఈ దేశానికి , 140 కోట్ల భారతీయులకు ఉందన్నారు. గత కొన్నేళ్లుగా రాహుల్ గాంధీ గౌతమ్ అదానీ నిర్వాకం, వ్యవహారంపై దుమారం రేపేలా ప్రశ్నిస్తున్నారు. నిలదీస్తున్నారు. చాలా సార్లు పార్లమెంట్ లో ప్రస్తావించారు. కానీ ఇప్పటి దాకా మోదీ సమాధానం ఇవ్వలేక పోయారు.
Also Read : Tummala KCR : చెదిరిన స్నేహం గులాబీకి దూరం