Rahul Gandhi : బాధితులకు రాహుల్ గాంధీ భరోసా
తాము అండగా ఉంటామని ప్రకటన
Rahul Gandhi : మణిపూర్ లో బిక్కు బిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్న బాధితులకు అండగా ఉంటానని స్పష్టం చేశారు ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ. శుక్రవారం ఆయన మణిపూర్ లో దాడులకు గురైన వారిని పరామర్శించారు. వారి సమస్యలు ఏమిటో తెలుసుకున్నారు. పార్టీ పరంగా తాము ఆదుకుంటామని హామీ ఇచ్చారు. విద్వేషాల మాయ మాటల్ని నమ్మి మోస పోవద్దని కోరారు. సంయమనం పాటించాలని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
కొందరు కావాలని దాడులకు పాల్పడే అవకాశం ఉందని కలిసికట్టుగా ఉండడం ఇప్పుడు కావాల్సిందని చెప్పారు రాహుల్ గాంధీ(Rahul Gandhi). హింస ఎప్పటికీ ఆమోద యోగ్యం కాదన్నారు. యావత్ ప్రపంచం సైతం శాంతిని కోరుకుంటోందన్నారు. ప్రేమ, శాంతి, సామరస్యం, ఆసరా కల్పించే గుణాన్ని కలిగి ఉండాలని స్పష్టం చేశారు. పార్టీ ఆధ్వర్యంలో శిబిరాలను ఏర్పాటు చేస్తామన్నారు. వైద్యం సాయం కావాల్సిన వారిని గుర్తించి ఆదుకుంటామన్నారు రాహుల్ గాంధీ.
అంతకు ముందు బాధిత కుటుంబాలకు చెందిన చిన్నారులతో కలిసి భోజనం చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. బాధితులతో మాట్లాడిన అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు కావాల్సింది రాజకీయాలు కాదని కేవలం వారికి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఇకనైనా మోదీ స్పందించక పోతే బాగుండదన్నారు.
Also Read : RS Praveen Kumar : తీరని దుఃఖం సాయిచంద్ మరణం