Rahul Gandhi Yatra : జమ్మూ కాశ్మీర్ లో రాహుల్ యాత్ర
జాకెట్ ధరించిన కాంగ్రెస్ అగ్ర నేత
Rahul Gandhi Yatra : రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర జమ్మూ కాశ్మీర్ కు చేరుకుంది. ఇప్పటి దాకా టీ షర్ట్ ధరిస్తూ పాదయాత్రలో పాల్గొన్న రాహుల్ గాంధీ ఉన్నట్టుండి జాకెట్ ధరించారు. ఇప్పటి వరకు రాహుల్ 125 రోజులు యాత్ర(Rahul Gandhi Yatra) చేపట్టారు. మొత్తం 3,400 కిలోమీటర్లు పూర్తి చేశారు. శీతాకాలంలో సైతం ఎలాంటి జాకెట్ ధరించ లేదు. చలి వణికిస్తున్నా రాహుల్ గాంధీ వాటిని లెక్క చేయలేదు.
ఎముకలు కొరికే చలిని సైతం ఆయన అధిగమించి పాదయాత్ర చేపడుతూ వెళ్లారు. కతువా లోని హత్లీ మోర్ నుండి తిరిగి ప్రారంభమైన రాహుల్ భారత్ జోడో యాత్రకు భారీ భద్రతను కల్పించారు. చలికాలం మొత్తం టీ షర్టు ధరించి ఉత్తర భారత దేశం గుండా కవాతు చేసిన రాహుల్ గాంధీ తొలిసారిగా జాకెట్ లో కనిపించడం విస్తు పోయేలా చేసింది.
ఉదయం నుండి జమ్మూ అంతటా చినుకులు కురుస్తుండడంతో చివరకు రక్షణ కోసం దుస్తులు ధరించారు. ఆ తర్వాత జాకెట్ ను తీసి వేశారు. తన సంతకంతో ఉన్న తెల్లటి టీ షర్టుతో కనిపించారు. ఇదిలా ఉండగా రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు(Rahul Gandhi Yatra) భారీ ఎత్తున జనాదరణ లభించింది.
ప్రతిపక్ష పార్టీలు సైతం యువ నాయకుడి ధైర్యాన్ని మెచ్చకున్నారు. అయితే తన దుస్తుల గురించి భారతీయ జనతా పార్టీ రాద్ధాంతం చేయడాన్ని లైట్ గా తీసుకున్నారు. వాళ్లు కళ్లున్న కబోదులు అంటూ ఎద్దవా చేశారు.
52 ఏళ్ల కాంగ్రెస్ నాయకుడు జనవరి 25న జమ్మూ కాశ్మీర్ లోని రాంబన్ జిల్లాలోని బనిహాల్ లో జాతీయ జెండాను ఎగుర వేయనున్నారు.
Also Read : జోడో యాత్ర అంటే మోదీకి భయం