Rahul Gandhi Jodo Yatra : కేర‌ళ‌లో రాహుల్ కు జ‌న నీరాజ‌నం

ఘ‌న స్వాగ‌తం ప‌లికిన పార్టీ శ్రేణులు

Rahul Gandhi Jodo Yatra : కాంగ్రెస్ పార్టీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర కేర‌ళ‌కు(Rahul Gandhi Jodo Yatra) చేరుకుంది. ఈ యాత్ర కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ , వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ ఆధ్వ‌ర్యంలో కొన‌సాగుతోంది. క‌న్యాకుమారి నుంచి ప్రారంభ‌మైన ఈ యాత్ర కాశ్మీర్ దాకా సాగ‌నుంది.

3,570 కిలోమీట‌ర్ల మేర 150 రోజుల పాటు కొన‌సాగ‌నుంది. త‌మిళ‌నాడులో ప్రారంభ‌మైన జోడో యాత్ర రాష్ట్రంలో ముగిసింది. కేర‌ళ‌లో అడుగు పెట్టిన రాహుల్ గాంధీకి అపూర్వ‌మైన రీతిలో ఘ‌న స్వాగ‌తం ప‌లికింది.

ప్ర‌తి రోజు ఉద‌యం 6.30 గంట‌ల నుండి సాయంత్రం దాకా యాత్ర కొన‌సాగ‌నుంది. రాహుల్ గాంధీ వెంట రాజ‌స్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ , చ‌త్తీస్ గ‌ఢ్ సీఎం భూపేష్ భ‌ఘేల్ తో పాటు సీనియ‌ర్ నాయ‌కులు ఉన్నారు.

కంటైన‌ర్లు కూడా ఉన్నాయి. త‌మిళ‌నాడు స‌రిహద్దు లోని ప‌ర‌సాల నుంచి కేర‌ళ‌లోకి ప్ర‌వేశించారు రాహుల్ గాంధీ(Rahul Gandhi). 19 రోజుల వ్య‌వ‌ధిలో మ‌లప్పురంలోని నిలంబూర్ వ‌ర‌కు 450 కిలోమీట‌ర్ల మేర పాద‌యాత్ర చేయ‌నున్నారు.

ఇవాళ్టి పాద‌యాత్ర‌లో కాంగ్రెస్ ఎంపీలు కేసీ వేణుగోపాల్ , శ‌శి థ‌రూర్ పాల్గొన్నారు. ఆదివారం ఉద‌యం రాజ‌ధాని న‌గ‌రంలోని ప‌ర‌స్ల ప్రాంతం నుంచి ప్రారంభ‌మైంది.

కేర‌ళ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ చీఫ్ , ఎంపీ కె. సుధాక‌ర‌న్ , రాష్ట్ర అసెంబ్లీలో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు వీడి స‌తీశ‌న్ , ఏఐసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి తారిక్ అన్వ‌ర్ , ఇత‌ర సీనియ‌ర్ నాయ‌కులు స్వాగ‌తం ప‌లికారు రాహుల్ గాంధీ. మాజీ సీఎం ఉమెన్ చాంది కూడా ఉన్నారు.

విద్య ద్వారా స్వేచ్ఛ పొందండి. సంస్థ ద్వారా బ‌లాన్ని పొందండి. ప‌రిశ్ర‌మ ద్వారా శ్రేయ‌స్సు పొందండి అన్న నారాయ‌ణ గురు జ‌న్మించిన కేర‌ళ‌కు ఎంట‌ర్ అయ్యామ‌ని పేర్కొన్నారు రాహుల్ గాంధీ.

Also Read : ల‌క్నో ఘ‌ట‌న‌లో 15 మంది అధికారుల‌పై వేటు

Leave A Reply

Your Email Id will not be published!