Rahul Gandhi Yatra : యూపీలో ఎంటరైన రాహుల్ గాంధీ
3,000 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి
Rahul Gandhi Yatra : దేశానికి ద్వేషం కాదు కావాల్సింది ప్రేమ అనే నినాదంతో భారత్ జోడో యాత్రను చేపట్టారు కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ. ఇప్పటి వరకు ఆయన 9 రాష్ట్రాలను పూర్తి చేశారు. గత ఏడాది 2022 సెప్టెంబర్ 6న తమిళనాడు లోని కన్యాకుమారి నుంచి ప్రారంభించారు యాత్రను. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్ , రాజస్థాన్ , హర్యానాలలో పూర్తయింది.
ఢిల్లీలో సభను చేపట్టారు. మంగళవారం తిరిగి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను(Rahul Gandhi Yatra) ప్రారంభించారు. దీంతో యాత్ర ఇప్పటి దాకా 3,000 కిలోమీటర్లు పూర్తయింది. తిమ్మిది రోజుల విరామం తర్వాత కాంగ్రెస్ అధినేత రాహుల్ యూపీలోకి ప్రవేశించారు. ఈ యాత్రి 110 రోజులకు పైగా సాగింది. ఇంకా 789 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టాల్సి ఉంది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా భారత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టారు.
అన్ని వర్గాల నుంచి భారీ ఎత్తున ఆదరణ లభించింది. వివిధ వర్గాల నుంచి నాయకులు , ప్రముఖులు రాహుల్ గాంధీ యాత్రలో పాల్గొన్నారు. సినీ ప్రముఖులు కూడా పాల్గొనడం విశేషం.
మరో వైపు జోడో యాత్రలో పాల్గొనాలని యూపీ మాజీ సీఎం , ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ , బీఎస్పీ చీఫ్ కుమారి మాయావతిని ఆహ్వానించారు. దీనిపై సంతోషం వ్యక్తం చేశారు ఎస్పీ చీఫ్. ఆయన చేపట్టిన యాత్ర సక్సెస్ కావాలని కోరారు.
భారత దేశ చరిత్రలో ఏ భారతీయ రాజకీయ నాయకుడు కాలినడకన భారీ పాదయాత్రను ఇంత వరకు చేపట్టలేదన్నారు కాంగ్రెస్ నేత జైరం రమేష్. జనవరి 26న శ్రీనగర్ లో యాత్ర ముగుస్తుంది.
Also Read : రాహుల్ ఆహ్వానం అఖిలేష్ సంతోషం