Rahul Gandhi Yatra : మక్తల్ నుంచి రాహుల్ పాదయాత్ర
మక్తల్ నుంచి పునః ప్రారంభం
Rahul Gandhi Yatra : కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi Yatra) చేపట్టిన భారత్ జోడో యాత్ర తిరిగి పునర్ ప్రారంభం కానుంది. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని గూడెబల్లూరు నుంచి రాహుల్ తన యాత్రను పునః ప్రారంభిస్తారు. ఆయన మొదటగా తమిళనాడులోని కన్యాకుమారి నుంచి జోడో యాత్రను స్టార్ట్ చేశారు.
తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఏపీ రాష్ట్రాలలో ఇప్పటి వరకు 48 రోజులకు పైగా పాదయాత్ర చేపట్టారు. భారీ ఎత్తన ఆయన యాత్రకు జనం నుంచి స్పందన లభిస్తోంది. చిన్నారుల నుంచి పెద్దల దాకా అన్ని వర్గాల ప్రజలు రాహుల్ గాంధీకి బ్రహ్మరథం పడుతున్నారు. ఏపీ నుంచి రాయచూర్ మీదుగా తెలంగాణ రాష్ట్ర సరిహద్దు కృష్ణా మీదుగా రాహుల్ పాదయాత్ర ఎంటర్ అయింది.
ఈ సందర్భంగా గూడె బల్లూరులో బస చేసిన అనంతరం నేరుగా రాహుల్ గాంధీ ఢిల్లీకి వెళ్లారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన కర్ణాటకకు చెందిన మల్లికార్జున్ ఖర్గే పదవీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఖర్గేకు అభినందనలు తెలిపారు.
ఇక తిరిగి ఇవాల్టి నుంచి అక్టోబర్ 27 గురువారం పాదయాత్ర పునః ప్రారంభించనున్నారు రాహుల్ గాంధీ. మక్తల్ నుంచి యాత్ర ప్రారంభిస్తారు. కన్యాకాపరమేశ్వరి ఆలయాన్ని దర్శించుకుంటారు. జక్లేర్ వరకు పాదయాత్ర చేపడతారు. ఎలిగండ్లలో బస చేస్తారు.
యాత్రలో భాగంగా 16 రోజుల పాటు తెలంగాణలో కొనసాగుతుంది. 19 అసెంబ్లీ, 7 పార్లమెంట్ నియోజకవర్గాల మీదుగా 375 కిలోమీటర్లు నడుస్తారు. యాత్రను సమన్వయం చేసేందుకు టీపీసీసీ 10 కమిటీలను ఏర్పాటు చేసింది.
Also Read : కొత్త నాటకానికి తెర లేపిన సీఎం – బండి