Mallikarjun Kharge : జోడో యాత్రతో కాంగ్రెస్ లో జోష్
ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే
Mallikarjun Kharge : ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు భారత్ జోడో యాత్రపై. యువ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన ఈ యాత్ర భారత దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న పవర్ ఏమిటో మరోసారి తెలిసిందన్నారు. భారతీయ జనతా పార్టీ, దాని అనుబంధ సంస్థలు, మద్దతుగా నిలిచిన పార్టీలు ఇప్పుడు పునరాలోచనలో పడ్డాయని పేర్కొన్నారు.
బుధవారం ఢిల్లీ పార్టీ ప్రధాన కార్యాలయంలో మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge) పార్టీ జెండాను ఎగుర వేశారు . ఈ సందర్భంగా ప్రసంగించారు. పార్టీ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా హాజరయ్యారు. పార్టీకి రాహుల్ చేపట్టిన యాత్ర సంజీవిని లాగా ఉపయోగ పడిందని కితాబు ఇచ్చారు మల్లికార్జున్ ఖర్గే. పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తల్లో మరింత ఉత్సాహాన్ని నింపేలా చేసిందన్నారు.
ఈ దేశంలో ఏం జరుగుతుందో, కేంద్రంలో ఉన్న అధికార పార్టీ ఎలా మీడియాను మ్యానేజ్ చేస్తుందో అర్థం చేసుకున్నారని అన్నారు ఖర్గే. భారత దేశం అనే ఆలోచన ఒక సవాల్ గా మారిందన్నారు. ద్వేసానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ ఏకం కావాలని కాంగ్రెస్ పార్టీ చీఫ్ పిలుపునిచ్చారు.
ఇవాళ పార్టీ 138వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకోవడం , దానికి తాను అధ్యక్షుడిగా ఉండడం గర్వంగా ఉందన్నారు మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge). ఇప్పటికే ఎందరో పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారని పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యంపై కాంగ్రెస్ పార్టీకి ఉన్న విశ్వాసం, అందరినీ వెంట తీసుకు వెళ్లాలనే సమ్మిళిత సిద్దాంతం, సమాన హక్కులు, అవకాశాలు కల్పించే రాజ్యాంగం పట్ల ఉన్న ప్రేమ వల్లే ఇలా జరిగిందన్నారు ఖర్గే. విద్వేషంతో సమాజం చీలి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read : రావణాసురుడి బాటలో బీజేపీ – ఖుర్షీద్