Rahul Gandhi Case : 21న రాహుల్ పిటిష‌న్ పై విచార‌ణ

గుజ‌రాత్ కోర్టు తీర్పుపై స‌వాల్

Rahul Gandhi Case : ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీకి ఊర‌టనిచ్చింది సుప్రీంకోర్టు. మోదీపై అనుచిత వ్యాఖ్య‌లు చేశారంటూ ప‌రువు న‌ష్టం కేసు నమోదైంది. ఈ కేసును విచారించిన సూర‌త్ కోర్టు 2 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దీనిని స‌వాల్ చేస్తూ గుజ‌రాత్ హైకోర్టును ఆశ్ర‌యించారు రాహుల్ గాంధీ. ఆయ‌న వేసిన పిటిష‌న్ ను తిర‌స్క‌రించింది. కింది కోర్టు సూర‌త్ ఇచ్చిన తీర్పు స‌రైన‌దేన‌ని , శిక్ష అనుభ‌వించాల్సిందేనంటూ స్ప‌ష్టం చేసింది. ఇదే స‌మ‌యంలో కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. అవ‌స‌ర‌మైతే తాము ఇచ్చిన తీర్పును స‌వాల్ చేస్తూ భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించ వ‌చ్చ‌ని తెలిపింది.

Rahul Gandhi Case Petition

దీంతో రాహుల్ గాంధీ(Rahul Gandhi Case) గుజ‌రాత్ కోర్టు పూర్తిగా క‌క్ష సాధింపుతో కూడుకున్న‌ద‌ని ఆరోపిస్తూ , త‌న‌కు న్యాయం చేయాల‌ని కోరుతూ ఉన్న‌త న్యాయ స్థానాన్ని ఆశ్ర‌యించారు. ఈ మేర‌కు రాహుల్ గాంధీ దాఖ‌లు చేసిన పిటిష‌న్ ను విచారించింది సుప్రీంకోర్టు. ఇందులో భాగంగా మంగ‌ళ‌వారం కీల‌క తీర్పు చెప్పింది.

ప‌రువు న‌ష్టం కేసులో త‌న దోషిపై స్టే విధించేందుకు నిరాక‌రించిన గుజ‌రాత్ హైకోర్టు ఆదేశాల‌ను స‌వాల్ చేస్తూ దాఖ‌లైన పిటిష‌న్ పై కీల‌క వ్యాఖ్య‌లు చేసింది సుప్రీంకోర్టు. ఇందులో భాగంగా జూలై 21న రాహుల్ కేసును విచార‌ణ చేప‌డ‌తామ‌ని స్పష్టం చేసింది ధ‌ర్మాస‌నం.

Also Read : Infosys Donated : శ్రీ‌వారికి ఇన్ఫోసిస్ సుధా..మూర్తి విరాళం 2 కిలోల‌కు

 

 

Leave A Reply

Your Email Id will not be published!