Rahul Gandhi : హిందీ జాతీయ భాషపై రాహుల్ కామెంట్స్
మాతృ భాషను గౌరవించడం అందరి బాధ్యత
Rahul Gandhi : కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన భారతీయ జనతా పార్టీని ఏకి పారేశారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా కర్ణాటకలో పర్యటిస్తున్నారు. ఒకే పార్టీ ఒకే దేశం ఒకే జాతి ఒకే భాష అన్న నినాదంతో ముందుకు వెళుతోంది కేంద్ర సర్కార్.
ఇప్పటికే హిందీని జాతీయ భాషగా గుర్తించాలని, అన్ని రాష్ట్రాలు తప్పనిసరిగా అమలు చేయాలని కేంద్రం కోరింది. ఇదే విషయాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా చెబుతూ వస్తున్నారు. పెద్ద ఎత్తున రాష్ట్రాలు తప్పు పడుతున్నాయి. ప్రధానంగా తమిళనాడు నిప్పులు చెరుగుతోంది.
దేశంలో అత్యంత ఆధునికమైన భాష ఏదైనా ఉందంటే అది తమిళం తప్ప ఇంకొకటి కాదని పేర్కొన్నారు. కర్ణాటకలో సైతం కేంద్ర నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఈ తరుణంలో కన్నడ నాట కొనసాగుతున్న యాత్రలో పాల్గొన్న రాహుల్ గాంధీ(Rahul Gandhi) మీడియాతో మాట్లాడారు.
ఏ భాషకు ప్రాధాన్యత ఇస్తారు మీరు అన్న ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. జాతీయ భాష ఏది అనే విషయం ఇప్పుడు అనవసరం. ప్రతి ఒక్కరికీ మాతృ భాష అన్నది ప్రధానమని, ముఖ్యమని స్పష్టం చేశారు. వారి వారి భాషలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
భాష పేరుతో రాష్ట్రాలను టార్గెట్ చేయడం, ప్రజల మనో భావాలు దెబ్బ తినేలా వ్యవహరించడం మంచి పద్దతి కాదన్నారు.
Also Read : లాలూ యాదవ్ కు సీఎం సపోర్ట్