Rahul Gandhi : సీనియ‌ర్లైనా ప‌ని చేస్తేనే టికెట్

స్ప‌ష్టం చేసిన రాహుల్ గాంధీ

Rahul Gandhi : పార్టీ కోసం ప‌ని చేసిన వారికి మాత్ర‌మే రాబోయే ఎన్నిక‌ల్లో టికెట్లు కేటాయించ‌డం జ‌రుగుతుంద‌ని ప్ర‌క‌టించారు కాంగ్రెస్ అగ్ర నేత‌, వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi).

రెండు రోజుల టూర్ లో భాగంగా ఆయ‌న ఓరుగ‌ల్లు వేదిక‌గా టీఆర్ఎస్ స‌ర్కార్ ను ఏకి పారేశారు. అనంత‌రం అరెస్టైన కాంగ్రెస్ నాయ‌కుల‌ను చంచ‌ల్ గూడ జైలులో శ‌నివారం రాహుల్ గాంధీ ప‌రామ‌ర్శించారు.

వారికి పార్టీ ప‌రంగా భ‌రోసా క‌ల్పించారు. ఆ త‌ర్వాత గాంధీ భ‌వ‌న్ లో కాంగ్రెస్ పార్టీ ప్ర‌తినిధులు, నాయ‌కుల‌తో, ప్ర‌జాప్ర‌తినిధుల‌తో జ‌రిగిన స‌మావేశంలో కీల‌క ప్ర‌సంగం చేశారు.

వ‌రంగ‌ల్ డిక్లరేష‌న్ అన్న‌ది పార్టీకి అత్యంత ముఖ్య‌మ‌న్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌తి ఒక్క‌రికి పార్టీ చేరాల‌ని పిలుపునిచ్చారు. యువ‌తీ, యువ‌కులు ఎంతో మంది నిరాశ‌తో ఉన్నార‌ని వారిని పార్టీలోకి ఆహ్వానించాల‌ని అన్నారు.

ఏ స్థాయిలో ఉన్నా, ఎంత‌టి సీనియ‌ర్ నాయ‌కుడైనా స‌రే క్షేత్ర స్థాయిలో ప‌ని చేయాల్సిందేన‌ని స్ప‌స్టం చేశారు రాహుల్ గాంధీ. ఎవ‌రినీ ఉపేక్షించే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. జ‌రిగే ఎన్నిక‌ల్లో ప్ర‌ధాన పోటీ కాంగ్రెస్, టీఆర్ఎస్ మ‌ధ్యే ఉంటుంద‌న్నారు.

రైతుల‌కు, ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉండాల‌ని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను యుద్దం ప్ర‌క‌టించాల‌ని , రాబోయేది తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వ‌మేన‌ని జోష్యం చెప్పారు రాహుల్ గాంధీ(Rahul Gandhi).

ప‌ని తీరు ఆధారంగానే టికెట్లు ఉంటాయ‌న్నారు. రాష్ట్ర రాజ‌ధానిలో ఉండ‌కుండా త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల‌లో ఉండాల‌ని హితోపేదేశం చేశారు. ఇదిలా ఉండ‌గా రాహుల్ గాంధీ(Rahul Gandhi) ప్ర‌సంగాన్ని పార్టీ జాతీయ అధికార ప్ర‌తినిధి దాసోజు శ్ర‌వ‌ణ్ అనువాదం చేశారు.

 

Also Read : క‌ర్ణాట‌క సీఎం పోస్టు విలువ 2,500 కోట్లు

Leave A Reply

Your Email Id will not be published!