Rahul Gandhi : ఇస్రో సక్సెస్ రాహుల్ కంగ్రాట్స్
బారత దేశానికి గర్వ కారణం
Rahul Gandhi : ఏపీలోని శ్రీహరి కోట వేదికగా ఇస్రో ఆధ్వర్యంలో తయారు చేసిన చంద్రయాన్ -3 ఉపగ్రహం శుక్రవారం మధ్యాహ్నం నింగి లోకి ప్రవేశ పెట్టింది. ఒక రకంగా విజయవంతమైంది. ఇది దేశానికి గర్వ కారణంగా నిలవబోతోందంటూ ప్రముఖులు పేర్కొన్నారు. ఇస్రో టీంకు ప్రత్యేకంగా అభినందనలు తెలియ చేస్తున్నారు.
ఇవాళ భారత దేశంలోని 135 కోట్ల మంది భారతీయులంతా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూశారు. ఇదే సమయంలో ప్రపంచంలోని పలు దేశాలు కూడా ఆసక్తితో గమనించాయి. ఇప్పటి వరకు చంద్రుడి వద్దకు వెళ్లేలా ఉపగ్రహాలను ప్రయోగించిన ఘనత కేవలం మూడు దేశాలు చైనా, అమెరికా, రష్యాకు మాత్రమే ఉన్నాయి.
ఒకవేళ ఇవాళ భారత్ గనుక ప్రవేశ పెట్టిన చంద్రయాన్ -3 గనుక సక్సెస్ అయితే నాలుగో దేశంగా నిలుస్తుంది. చరిత్ర సృష్టించేందుకు ఇంకా కొన్ని రోజులు ఓపిక పట్టాల్సి ఉంది. ఇదిలా ఉండగా చంద్రయాన్ -3 ఉపగ్రహాన్ని సక్సెస్ ఫుల్ గా నింగి లోకి పంపించినందుకు ఇస్రో టీంను రాహుల్ గాంధీ(Rahul Gandhi) ప్రత్యేకంగా అభినందించారు. 1962లో ఆనాటి ప్రభుత్వం ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు.
Also Read : KTR Dasoju Sravan : దాసోజుకు భరోసా బెదిరింపులపై ఆరా