Rahul Gandhi Container : రాహుల్ గాంధీ కంటైనర్ వెరీ స్పెషల్
12 కంటైనర్లు సీనియర్ల కోసం ఏర్పాటు
Rahul Gandhi Container : కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జవసత్వాలు కోల్పోయేందుకు సిద్దంగా ఉన్న పార్టీని బతికించే బాధ్యతను భుజాన వేసుకున్నారు.
ఇందులో భాగంగా భారత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టారు. తమిళనాడు లోని కన్యాకుమారి నుంచి జమ్మూ కాశ్మీర్ లోని కాశ్మీర్ వరకు 3,570 కిలోమీటర్లు 150 రోజుల పాటు పాదయాత్ర చేపడుతున్నారు.
ఇప్పటికే పాదయాత్ర ప్రారంభమైంది. తమిళనాడు లో ఇవాల్టితో ముగిసింది. ఈరోజు నుంచి జోడో యాత్ర కేరళలోకి ప్రవేశిస్తుంది. ఉదయం 6.30 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6.30 గంటల వరకు కొనసాగుతోంది.
రాహుల్ గాంధీ వెంట సీనియర్ నాయకులు , సీఎంలు హాజరవుతున్నారు. ఆయన వెంట నడుస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం కాంగ్రెస్ అగ్ర నాయకుడితో పాటు ఇతరులకు సంబంధించిన కంటైనర్లు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి యాత్రలో.
ఇందు కోసం 60 కన్వర్టెడ్ కంటైనర్లను ఉపయోగిస్తున్నారు. ఇందులో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసేలా రూపొందించారు. రాహుల్ గాంధీకి ప్రైవేట్ కంటైనర్ (Rahul Gandhi Container) ఉండగా ఇతరులకు 2 నుంచి 12 పడకలు ఉన్నాయి.
ఇదే మొదటిసారి ఉపయోగించడం. 52 ఏళ్ల వయస్సు కలిగిన రాహుల్ గాంధీ ఒక కంటైనర్ లో ఉన్నారు. దాదాపు రెండు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న తాత్కాలిక క్యాంప్ సైట్లలో ప్రతి రోజూ రాత్రి ఉంచే కంటైనర్లలో ఆహారం ఉండదని తెలిపారు పార్టీ మీడియా ఇన్ చార్జ్ జైరాం రమేష్.
ఇదిలా ఉండగా ఈ కంటెయినర్లను పాదయాత్రతో పాటు లారీలపై తరలిస్తున్నారు.
Also Read : హర్యానా మహిళా కమిషన్ చైర్ పర్సన్ ఫైర్