Rahul Gandhi : మోదీ పరువు నష్టం కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. శుక్రవారం గుజరాత్ కోర్టు ఇచ్చిన తీర్పు పై కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు రెండేళ్ల జైలు శిక్షపై స్టే విధించింది. ఈ సందర్బంగా రాహుల్ గాంధీ(Rahul Gandhi) తీర్పు వెలువడిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
Rahul Gandhi Said
ఈ దేశంలో ఇంకా న్యాయం బతికే ఉందని నిరూపించింది భారత దేశ సర్వోన్నత న్యాయ స్థానం అని కొనియాడారు. బీజేపీ ప్రభుత్వం వల్ల జరిగే మారణకాండ గురించి ఎప్పటికప్పుడు దేశ ప్రజలకు తెలియ చేస్తూ వచ్చానని అన్నారు.
కేవలం కులం, మతం, విద్వేషాల ఆధారంగా రాజకీయాలు చేస్తోందంటూ మోదీపై, భారతీయ జనతా పార్టీపై, దాని అనుబంధ సంస్థలపై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేకించి ముస్లిం, హిందువుల మధ్య విద్వేసాలు పెంచుతోందన్నారు.
తూర్పు భారత దేశంలో మణిపూర్ , నాగాలాండ్ ఇవాళ అగ్ని గుండాలను తలపింప చేస్తోందన్నారు. హింస, ద్వేషం వల్ల దేశం అభివృద్ది చెందదన్నారు రాహుల్ గాంధీ. మనుషుల మధ్య ఘర్షణలు పెరుగుతున్నాయని, ఇది ఎంత మాత్రం ఆమోద యోగ్యం కాదన్నారు.
Also Read : Supreme Court Stays : రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు ఊరట