S Jai Shankar Rahul : రాహుల్ దేశానికి వ్యతిరేకం – జై శంకర్
కాంగ్రెస్ నేత కామెంట్స్ పై సీరియస్
S Jai Shankar Rahul : కేంద్రం అనుసరిస్తున్న విదేశాంగ విధానంపై తీవ్ర విమర్శలు చేసిన కాంగ్రెస్ అగ్ర నాయకుడు, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీపై విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్(S Jai Shankar Rahul) నిప్పులు చెరిగారు. రాహుల్ గాంధీ భారత దేశానికి మద్దతు ఇవ్వడం లేదని ఆయన యూరప్ దేశాలకు మద్దతు ఇస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. రాహుల్ గాంధీ ఇంకా ప్రతిపక్ష నాయకుడిగా ఎదగ లేదన్నారు. దేశం పట్ల ఆయనకు ఏమాత్రం చిత్తశుద్ది లేక పోగా అవగాహన కూడా లేదని ఎద్దేవా చేశారు.
ఎదుటి వాళ్లపై రాళ్లు వేసే ముందు తాము ఏమిటో చూసుకోవాలన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వాన్ని యావత్ ప్రపంచం గుర్తించిందని, ప్రశంసిస్తోందని అందుకే భారత్ కు జి20 నాయకత్వం వహించే అవకాశం దక్కిందని అన్నారు జై శంకర్.
లండన్ లో ఇండియన్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ తో మాట్లాడిన రాహుల్ గాంధీ పై సీరియస్ గా స్పందించారు. తాము పూర్తిగా నిబద్దతతో పని చేస్తున్నామని , దాయాది పాకిస్తాన్ కూడా భారత దేశం అనుసరిస్తున్న విదేశాంగ విధానాన్ని మెచ్చుకున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు జై శంకర్(S Jai Shankar).
మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన గురించి కితాబు ఇచ్చారని ఆ విషయం అర్థం చేసుకుంటే మంచిదన్నారు. తాను పిరికితనంతో భయపడి చైనా గురించి కామెంట్స్ చేయలేదన్నారు. రాహుల్ గాంధీ తన కామెంట్స్ ను తప్పుగా అర్తం చేసుకున్నారని పేర్కొన్నారు. ఎవరు ఏమిటో ఈ దేశానికి తెలుసన్నారు జై శంకర్. ఇక నుంచైనా పూర్తిగా వివరాలు తెలుసుకుని లేదా అవగాహన కలిగి ఉంటే బాగుంటుందని సూచించారు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి.
Also Read : మోదీ అబద్దం చైనా ఆక్రమణ నిజం