Rahul Gandhi : భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలకమైన తీర్పు ఇవ్వడంతో ఎట్టకేలకు రాహుల్ గాంధీకి ఊరట లభించింది. ఈ మేరకు తన ఎంపీ పదవిపై అనర్హత వేటు వేయడాన్ని ఆయన తప్పు పట్టారు. సూరత్ కోర్టు విధించిన శిక్షను పరిగణలోకి తీసుకోవడం లేదని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేశారు. తనపై 2 ఏళ్ల జైలు శిక్ష విధించడాన్ని సవాల్ చేశారు రాహుల్ గాంధీ.
Rahul Gandhi Arrived Parliement
మోదీ పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి శిక్ష విధించింది కింది కోర్టు. దీనిపై హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా రాహుల్ కు చుక్కెదురైంది. దీంతో సర్వోన్నత న్యాయ స్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. సూరత్ కోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే లోక్ సభ స్పీకర్ రాహుల్ గాంధీ ఎంపీగా అనర్డుంటూ వేటు వేశారు. దీంతో ఆయన ఎంపీ పదవిని కోల్పోయారు.
తీరా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేయడం, స్టే విధించడంతో పార్లమెంట్ స్పీకర్ తిరిగి ఎంపీ పదవిని పునరుద్దరిస్తున్నట్లు నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ లోక్ సభకు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన ఫుల్ జోష్ లో కనిపించారు. సత్యం చివరకు గెలుస్తుందని అన్నారు. దానిని అడ్డు కోవడం ఎవరి చేత కాదన్నారు రాహుల్ గాంధీ.
Also Read : Sonia Gandhi : మణిపూర్ అల్లర్లపై సోనియా ఆరా