Rahul Gandhi : హైదరాబాద్ – తెలంగాణలో ఎన్నికలు వేడి ఆఖరి అంకానికి చేరుకుంది. నువ్వా నేనా అన్న రీతిలో పోటీ పడుతున్నాయి పార్టీలు. ఈ తరుణంలో ఏఐసీసీ మాజీ కార్యదర్శి , వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ , జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేతో పాటు సీనియర్ నాయకులు జల్లెడ పట్టారు. సుడిగాలి పర్యటన చేశారు.
Rahul Gandhi in Auto
తాజాగా అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. తాను సీనియర్ నాయకుడైనప్పటికీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) సామాన్యుడిలా మారి పోతున్నారు. ప్రజలతో మమేకం అయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఆయన చేపట్టిన భారత్ జోడో యాత్ర బిగ్ సక్సెస్ అయ్యింది. ఇది ఒక రకంగా ఆక్టోపస్ లా విస్తరించిన భారతీయ జనతా పార్టీకి షాక్ తగిలింది. దీంతో ఆయనను డ్యామేజ్ చేసే పనిలో పడ్డారు ప్రధాన మంత్రి మోదీ.
పరువు నష్టం కేసు వేశారు. వివిధ చోట్ల కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో తన లోక్ సభ సభ్యత్వం రద్దు చేసినా వెనక్కి తగ్గలేదు. మంగళవారం హైదరాబాద్ లో రాహుల్ గాంధీ హల్ చల్ చేశారు. జూబ్లీ హిల్స్ లో పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహమ్మద్ అజహరుద్దీన్ తో కలిసి ఆటోలో నగరంలో ప్రయాణం చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి. ట్రెండింగ్ లో కొనసాగుతున్నాయి.
Also Read : CM KCR : ప్రజలే నాకు బలం బలగం – కేసీఆర్