Rahul Gandhi : అమ‌రావ‌తికి జై కొట్టిన రాహుల్ గాంధీ

ముమ్మాటికీ ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తినే

Rahul Gandhi : కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు, వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం ఏపీలో మూడు రాజ‌ధానులపై ఎక్కువ‌గా చ‌ర్చ జ‌రుగుతోంది. ప్ర‌ధానంగా ఏపీ సీఎం సందింటి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి దీనిపై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టారు. దీంతో అమ‌రావ‌తి రైతులు పెద్ద ఎత్తున ఆందోళ‌న చేప‌డుతున్నారు గ‌త కొన్ని రోజుల నుంచి.

ఇదిలా ఉండ‌గా రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర మంగ‌ళ‌వారం ఏపీలోకి చేరింది. ఈ సంద‌ర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడారు. ఏపీకి అమ‌రావ‌తి మాత్ర‌మే రాజ‌ధాని అని స్ప‌ష్టం చేశారు. తాము ఇచ్చిన మాట‌కు క‌ట్టుబడి ఉన్నామ‌ని అన్నారు. అక్క‌డి రైతుల పోరాటానికి తాను సంపూర్ణ మ‌ద్ద‌తు తెలియ చేస్తున్నాన‌ని చెప్పారు.

అవ‌స‌ర‌మైతే రైతుల కోసం కావాల్సిన న్యాయ స‌హాయం కూడా తాను అంద‌జేస్తాన‌ని హామీ ఇచ్చారు. త‌న‌కు వీలు కుదిరితే అమ‌రావ‌తి కోసం రైతులు చేస్తున్న పాద‌యాత్ర‌లో తాను కూడా పాల్గొంటాన‌ని స్ప‌ష్టం చేశారు. మ‌రో వైపు పోల‌వ‌రం ప్రాజెక్టు కార‌ణంగా నిర్వాసితులైన వారికి అండ‌గా ఉంటాన‌ని పేర్కొన్నారు.

ఏపీలోని ఆదోని మండ‌లం శాగి గ్రామం లో బ‌స చేస్తారు రాహుల్ గాంధీ(Rahul Gandhi). ఆయ‌న చేప‌ట్టిన పాద‌యాత్ర ఇప్ప‌టి వ‌ర‌కు 1,000 కిలోమీట‌ర్లు పూర్త‌యింది.

ఈ యాత్ర‌కు ప్ర‌జ‌ల నుంచి అనూహ్య‌మైన స్పంద‌న ల‌భిస్తోంది. త‌మిళ‌నాడులో ప్రారంభ‌మైన యాత్ర కేర‌ళ‌, క‌ర్ణాట‌క‌లో ముగిసింది. ప్ర‌స్తుతం ఏపీలో కొన‌సాగుతోంది. రాహుల్ గాంధీని అమ‌రావ‌తి రైతులు క‌లిశారు. త‌మ‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల్సిందిగా కోరారు.

Also Read : అమ‌రావ‌తి రైతన్న‌లకు రాహుల్ భ‌రోసా

Leave A Reply

Your Email Id will not be published!