Rahul Gandhi : ప్రజా తీర్పుకు సలాం హామీలు నెరవేరుస్తాం
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ప్రకటన
Rahul Gandhi : ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. కానీ ద్వేషాన్ని కాదని అర్థమై పోయిందని షాకింగ్ కామెంట్స్ చేశారు కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ , వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ. ఆయన చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర ప్రస్తుతం రాజస్థాన్ లో కొనసాగుతోంది. ఇదిలా ఉండగా గురువారం దేశ రాజకీయాలలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.
గుజరాత్ లో భారతీయ జనతా పార్టీ అత్యధిక సీట్లు గెలుపొంది చరిత్ర సృష్టించింది. కానీ హిమాచల్ ప్రదేశ్ లో ఆ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. ఇదిలా ఉండగా ఇక్కడ మొత్తం 68 సీట్లకు గాను 40 సీట్లలో కాంగ్రెస్ పార్టీ లీడ్ లో కొనసాగుతోంది. ఇక బీజేపీ కేవలం 25 సీట్లలో ఆధిక్యంలో ఉంది.
ఈ సందర్భంగా అద్బుత విజయాన్ని కట్టబెట్టినందుకు రాహుల్ గాంధీ(Rahul Gandhi) సంతోషం వ్యక్తం చేశారు. హిమాచల్ ప్రదేశ్ ప్రజలు ఇచ్చిన తీర్పు చరిత్రలో నిలిచి పోతుందన్నారు. ఒక రకంగా కులం, ప్రాంతం, మతం పేరుతో విద్వేష రాజకీయాలు చేస్తూ వచ్చిన వారికి చెంప ఛెళ్లుమనిపించేలా తీర్పు చెప్పారని కితాబు ఇచ్చారు.
రాష్ట్ర ప్రజలకు తాము ఏమైతే హామీలు ఇచ్చామో వాటిని అమలు చేసేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఏదో ఒక రోజు దేశంలో మార్పు ను ప్రజలు కోరుకోవడం ఖాయమని జోష్యం చెప్పారు రాహుల్ గాంధీ. ప్రజలకు జవాబుదారీగా ఉండాలే తప్పా అవకాశవాద రాజకీయాలు చేయకూడదని స్పష్టం చేశారు.
ఈ మేరకు ఆయన మోదీపై మరోసాని నిప్పులు చెరిగారు. మరో వైపు ఓట్లు వేయని వారికి కూడా ధన్యవాదాలు తెలిపారు రాహుల్ గాంధీ.
Also Read : ప్రజా తీర్పు శిరోధార్యం – జైరామ్ ఠాకూర్