Rahul Gandhi : ఆధునిక టెక్నాలజీపై దృష్టి పెట్టాలి
విద్యార్థులతో ఎంపీ రాహుల్ గాంధీ
Rahul Gandhi : న్యూఢిల్లీ – రోజు రోజుకు ప్రపంచం మారుతోంది. టెక్నాలజీ పరంగా ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , మెషిన్ లెర్నింగ్ , క్లౌడ్ టెక్నాలజీ, డేటా సైన్స్ , బిజినెస్ ఎనలిటిక్స్ , సాఫ్ట్ వేర్ టెస్టింగ్ , తదితర వాటి పట్ల ఎక్కువగా విద్యార్థులు దృష్టి సారించాలని స్పష్టం చేశారు.
Rahul Gandhi Comment about Technology
హార్వర్డ్ యూనివర్శిటీ విద్యార్థులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు రాహుల్ గాంధీ(Rahul Gandhi). ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. భారత దేశంలో కులం, మతం పేరుతో నిరంకుశత్వం రాజ్యమేలుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీని పట్ల జాగ్రత్తతో ఉండాలని సూచించారు.
కార్పొరేట్ కంపెనీలు, బడా వ్యాపారవేత్తలకు పెద్ద ఎత్తున నిస్సిగ్గుగా కేంద్ర సర్కార్ మద్దతు తెలుపుతోందని ఆవేదన చెందారు. చైనా ఎందుకు అభివృద్ది చెందిందనే దానిపై కూడా ఫోకస్ పెట్టాలన్నారు.
చైనా దాడులను ఎదుర్కోవడంలో భారత్ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు రాహుల్ గాంధీ. దేశంలో అంతులేని రీతిలో మతం పేరుకు పోయిందన్నారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెరిగి పోయినా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పట్టించు కోవడం లేదని ధ్వజమెత్తారు.
Also Read : Bhatti Vikramarka Dy CM : ప్రజా భవన్ లో భట్టి విందు