Rahul Gandhi Painting : రాహుల్ గాంధీ మ‌న‌సు దోచిన చిన్నారి

త‌న చిత్రాన్ని గీసినందుకు అభినంద‌న

Rahul Gandhi Painting : మ‌న‌సుంటే మార్గాలు ఎన్నో. ఒక్కోసారి ఎవ‌రు ఎప్పుడు ఎలా పాపుల‌ర్ అవుతారో చెప్ప‌లేం. ఇప్పుడు ఓ చిన్నారి సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది. నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

ఇంత‌కీ ఆ చిన్నారి ఎవ‌రు. ఏం చేసింద‌ని ఇంత‌లా పాపుల‌ర్ అయ్యిందోననే ఉత్కంఠ నెల‌కొన‌డం ఖాయం. కాంగ్రెస్ పార్టీ చీఫ్‌, వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీ చిత్రాన్ని(Rahul Gandhi Painting) ఆ చిన్నారి గీసింది.

మూడు రోజుల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా కేర‌ళ‌లో కొలువు తీరారు. ఈ సంద‌ర్భంగా స‌భ‌లో ఆసీనులైన రాహుల్ గాంధీ మ‌రో సీనియ‌ర్ నేత‌తో మాట్లాడుతండ‌గా ఆ చిన్నారి రాహుల్ గాంధీని క‌లిసేందుకు వ‌చ్చింది.

ఈ సంద‌ర్భంగా ఆ పాప చేతిలో ఉన్న చిత్రాన్ని ఆశ్చ‌ర్యానికి గుర‌య్యారు కాంగ్రెస్ అగ్ర నేత‌. ఇదే స‌మ‌యంలో ఆ పాప అద్భుతంగా చిత్రాన్ని గీసింది. ఆ చిత్రం ఎవ‌రిదో కాదు రాహుల్ గాంధీది.

ఇంత చిన్న వ‌య‌స్సులో త‌న చిత్రాన్ని గీసిన ఆ చిన్నారిని ప్ర‌త్యేకంగా అభినందించారు. ఈ సంద‌ర్బంగా ట్విట్ట‌ర్ ను షేక్ చేసింది ఈ చిత్రం. ప్ర‌త్యేకంగా రాహుల్ గాంధీ ఆ చిత్రాన్ని చూసి విస్తు పోయారు.

ఆ పాప పేరు, ఏం చదువుకుంటున్నావు అని కుశ‌ల ప్ర‌శ్న‌లు వేశారు అంతే కాదు నేను నీకు ఎలా తెలుసు అంటూ ప్ర‌శ్నించారు. ఆ చిన్నారి మీరంటే త‌న‌కు ఇష్ట‌మ‌ని , త‌న‌కు పెయింటింగ్స్ వేయాలంటే అభిమాన‌మ‌ని తెలిపింది.

ఈ సంద‌ర్భంగా మిమ్మ‌ల్ని చిత్రంగా గీసిన‌ట్లు చెప్పింది. ఇదిలా ఉండ‌గా కాంగ్రెస్ శ్రేణులు రాహుల్ గాంధీ పెయింటింగ్ తో కూడిన ఫోటోను ట్విట్ట‌ర్ లో షేర్ చేసింది.

ఈ సంద‌ర్భంగా ఆ ఫోటోకు. – క‌ళ్లు మాట్లాడ‌వ‌ని ఎవ‌రు చెప్పారు – అంటూ అంద‌మైన క్యాప్ష‌న్ జ‌త ప‌ర్చ‌డం మ‌రో హైలెట్.

Also Read : మ‌రాఠా స్పీక‌ర్ గా రాహుల్ నార్వేక‌ర్

Leave A Reply

Your Email Id will not be published!