Rahul Gandhi : ప్రజా సంక్షేమం కాంగ్రెస్ లక్ష్యం
స్పష్టం చేసిన ఎంపీ రాహుల్ గాంధీ
Rahul Gandhi : రాజస్థాన్ లో ఎన్నికల వేడి రాజుకుంది. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీలు హోరా హోరీగా ప్రచారం చేస్తున్నాయి. రాజస్థాన్ లో జరిగిన సభలో కాంగ్రెస్ అగ్ర నేత, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) ప్రసంగించారు. రాజస్థాన్ లో కొలువు తీరిన తమ పార్టీ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పని చేసిందన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇక్కడ సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతోందన్నారు రాహుల్ గాంధీ.
Rahul Gandhi Speech on Rajasthan
పలు పథకాల కింద సీఎం చిరంజీవి యోజన కింద రూ. 25 లక్షల ఆరోగ్య బీమా అందజేస్తోందని తెలిపారు. కాళీ బాయి స్కూటీ పథకం కింద బాలికల విద్యార్థినులకు ఉచితంగా స్కూటీ (స్కూటర్ )ను అందజేస్తున్నట్లు వెల్లడించారు. సీఎం కోచింగ్ పథకం కింద పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తోందన్నారు రాహుల్ గాంధీ.
ఎస్సీ, ఎస్టీ అభివృద్ది నిధికి సంబంధించి గతంలో రూ. 500 కోట్లు కేటాయించడం జరిగిందని కానీ దానిని రెండింతలు చేసిందన్నారు. ప్రస్తుతం బడ్జెట్ ను రూ. 1,000 కోట్లకు పెంచామన్నారు. పాత పెన్షన్ పథకం కింద దాదాపు రాజస్తాన్ రాష్ట్రంలోని 90 లక్షల మందికి పైగా లబ్ది పొందుతున్నారని చెప్పారు రాహుల్ గాంధీ.
Also Read : Prakash Raj : స్మృతీ ఇరానీపై ప్రకాశ్ రాజ్ ఫైర్