Rahul Gandhi : ఈడీ విచార‌ణ‌కు ర్యాలీగా రాహుల్

ఢిల్లీలో భారీ చేరుకున్న కార్య‌క‌ర్తలు

Rahul Gandhi : నేష‌న‌ల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి స‌మ‌న్లు అందుకున్న కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ ఢిల్లీలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ ఎదుట విచార‌ణ‌ను ఎదుర్కొనేందుకు కాలిన‌డ‌క‌న బ‌య‌లు దేరారు.

స‌త్యాగ్ర‌హ్ పేరుతో చేప‌ట్టారు. దేశ రాజ‌ధానిలో పెద్ద ఎత్తున నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు చేరుకున్నారు. ఎక్క‌డ చూసినా రాహుల్ గాంధీ(Rahul Gandhi) కి మ‌ద్ద‌తుగా ర్యాలీ చేప‌ట్టారు. రాహుల్ గాంధీ వెంట ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు.

ఆయ‌న‌తో పాటు దేశంలోని సీనియ‌ర్ నాయ‌కులు, సీఎంలు, ఎంపీలు , ఎమ్మెల్యేలు భారీగా చేరుకున్నారు. పూర్తిగా సంఘీభావం మ‌ద్ద‌తు తెలిపారు. కార్య‌క‌ర్త‌ల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం కావాల‌ని వేధింపుల‌కు గురి చేస్తోందంటూ ఆరోపించారు. ఇదిలా ఉండ‌గా రాహుల్ గాంధీ కాలిన‌డ‌క‌న బ‌య‌లు దేరారు.

రాజ‌స్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ , ఛ‌త్తీస్ గ‌ఢ్ సీఎం భూపేష్ బాఘెల్ , దిగ్విజ‌య్ సింగ్ , పి. చిదంబ‌రం, జైరాం ర‌మేష్ , స‌చిన్ పైల‌ట్ , ముకుల్ వాస్నిక్ , గౌర‌వ్ గొగోయ్ , త‌దిత‌రులు ఢిల్లీకి చేరుకున్నారు.

పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యానికి వీరంతా చేరుకున్నారు. ఢిల్లీలో ప్ర‌స్తుతం ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఇదిలా ఉండ‌గా దేశవ్యాప్తంగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) ఆఫీసుల ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌లు, ధ‌ర్నాలు చేప‌ట్టారు.

కాగా రాహుల్(Rahul Gandhi) చేప‌ట్టిన స‌త్యాగ్ర‌హ్ కార్య‌క్ర‌మానికి తాము అనుమ‌తి ఇవ్వ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు ఢిల్లీ పోలీసులు. ఇదిలా ఉండ‌గా తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో ఆందోళ‌న‌లు చేప‌ట్టారు.

Also Read : దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళ‌న

Leave A Reply

Your Email Id will not be published!