Rahul Gandhi : బీజేపీ దోస్తులారా భయపడకండి
పార్లమెంట్ లో ఎంపీ రాహుల్ గాంధీ
Rahul Gandhi : పరువు నష్టం కేసులో ఊరట పొందిన వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయనపై వేసిన అనర్హత వేటును తొలగించారు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. నిన్న మణిపూర్ అంశంపై కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ గౌరవ్ గొగోయ్ నిప్పులు చెరిగారు.
Rahul Gandhi Speaks
బుధవారం ఎంపీ రాహుల్ గాంధీ అనర్హత వేటు అనంతరం సభలో ప్రసంగించారు. ప్రధానంగా కేంద్ర సర్కార్ ను, బీజేపీ మంత్రులను టార్గెట్ చేశారు. ఆయన పదే పదే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వచ్చారు. ఈ సందర్బంగా అడ్డుకునే ప్రయత్నం చేశారు అధికార పార్టీ నాయకులు.
దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపారు ఎంపీలు. ముందు రాహుల్ గాంధీ(Rahul Gandhi)ని మాట్లాడనివ్వాలని స్పష్టం చేశారు. దీంతో స్పీకర్ ఓం బిర్లా జోక్యం చేసుకున్నారు. మీరు చెప్పదల్చుకున్నది ఏమిటో సూటిగా చెప్పాలని కోరారు.
దీంతో రాహుల్ గాంధీ సెటైర్ వేశారు. బీజేపీ మిత్రులారా భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఎందుకంటే తాను మోదీకి, బీజేపీ, సంకీర్ణ సర్కార్ కు అత్యంత ప్రియమైన వ్యక్తిగా పేరు పొందిన ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ గురించి, మోదీకి, ఆయనకు మధ్య ఉన్న బంధం గురించి మాట్లాడ బోనంటూ ప్రకటించారు.
Also Read : Ajit Agarkar : ఆసియా..వరల్డ్ కప్ జట్టుపై ఉత్కంఠ