Rahul Gandhi : అవినీతిని బ‌య‌ట పెడితే జ‌డ్జిని బెదిరిస్తారా

బీజేపీ స‌ర్కార్ పై నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ

Rahul Gandhi : కాంగ్రెస్ మాజీ చీఫ్‌, వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆయ‌న మంగ‌ళ‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా కేంద్ర ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న విధానాల‌ను ఎండ‌గ‌ట్టారు.

క‌ర్ణాట‌క‌లో భార‌తీయ జ‌న‌తాపార్టీ సార‌థ్యంలో కొలువు తీరిన ప్ర‌భుత్వం పూర్తిగా అవినీతి, అక్ర‌మాల‌కు అడ్డాగా మారిందంటూ ఆరోపించారు రాహుల్ గాంధీ.

ఇదే అంశాన్ని బ‌య‌ట పెట్టినందుకు హైకోర్టు న్యాయ‌మూర్తిని బెదిరించడం దారుణ‌మ‌ని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి స‌ద‌రు న్యాయ‌మూర్తి జూమ్ మీటింగ్ లో మాట్లాడిన వీడియోను ఈ సంద‌ర్భంగా రాహుల్ గాంధీ(Rahul Gandhi)  షేర్ చేశారు.

ప్ర‌స్తుతం ఇది వైర‌ల్ గా మారింది. భార‌త రాజ్యాంగంలో న్యాయ వ్య‌వ‌స్థ అత్యంత కీల‌క‌మైన‌ద‌ని, కానీ చివ‌ర‌కు తాము చేసిన త‌ప్పుల్ని, అక్ర‌మాల గురించి ప్ర‌శ్నించినందుకు న్యాయ‌మూర్తిని ఎలా ఇబ్బందుల‌కు గురి చేస్తారంటూ ప్ర‌శ్నించారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌భుత్వానికి త‌న తీర్పుతో చుక్క‌లు చూపిస్తున్న స‌ద‌రు న్యాయ‌మూర్తిని ప్ర‌త్యేకంగా అభినందించారు రాహుల్ గాంధీ. ఇదే స‌మ‌యంలో ఆయ‌న‌కు పూర్తిగా ర‌క్ష‌ణ క‌ల్పించాల్సిన బాధ్య‌త ఆ రాస్ట్ర ప్ర‌భుత్వానిదేన‌ని స్ప‌ష్టం చేశారు.

ప్ర‌భుత్వ సంస్థ‌ల‌ను బుల్ డోజ‌ర్ చేస్తూ పోతే ఎలా అని ప్ర‌శ్నించారు. త‌మ క‌ర్త‌వ్యాన్ని నిర్వ‌ర్తించే వారికి అండ‌గా నిల‌వాల‌ని పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ.

ఇదిలా ఉండ‌గా పోలీస్ రిక్రూట్ మెంట్ స్కాంకు సంబంధించి సీనియ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్ ను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై పెద్ద ఎత్తున రాద్ధాంతం జ‌రుగుతోంది.

వెంట‌నే నైతిక బాధ్య‌త వ‌హిస్తూ రాష్ట్ర హోం శాఖ మంత్రి రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేశారు మాజీ సీఎం సిద్ద‌రామ‌య్య‌.

Also Read : న్యాయ‌మూర్తుల‌పై సీజేఐకి లేఖాస్త్రం

Leave A Reply

Your Email Id will not be published!