Rahul Gandhi : టీఆర్ఎస్ పై యుద్దం తప్ప పొత్తుండదు
తెలంగాణ వల్ల కేసీఆర్ ఫ్యామలీకి లాభం
Rahul Gandhi : కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సంచలన కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో కొలువు తీరిన టీఆర్ఎస్ ప్రభుత్వంపై యుద్దం కొనసాగుతుందని ఎక్కడా రాజీ పడడం అంటూ ఉండదన్నారు.
కొందరు పొత్తు పెట్టుకుంటారంటూ చేస్తున్న ప్రచారాన్ని ఆయన తిప్పి కొట్టారు. హన్మకొండ వేదికగా జరిగిన రైతు సంఘర్షణ సభలో రాహుల్ గాంధీ(Rahul Gandhi) ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
కేసీఆర్ వల్ల తెలంగాణ రాలేదని సంచలన ఆరోపణలు చేశారు. ఎంతటి వారైనా ఎవరైనా సరే గీత దాటితే వేటు వేయక తప్పదని హెచ్చరించారు.
తెలంగాణ రాష్ట్రం నాలుగున్నర కోట్ల ప్రజలదని కేసీఆర్ కుటుంబానికి చెందినది కాదని అన్నారు. ప్రత్యేక తెలంగాణ వేలాది మంది బలిదానాలు, త్యాగాలు చేయడం వల్ల వచ్చిందన్నారు. ఒకే ఒక్క కుటుంబం మాత్రమే బాగు పడిందని ఆరోపించారు.
రైతులు అరిగోస పడుతున్నారని కానీ కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారంటూ ధ్వజమెత్తారు. రైతులు ఓ వైపు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే రాజకీయం చేయడం మంచి పద్దతి కాదన్నారు.
దేశంలో ఎక్కడా లేని రీతిలో తెలంగాణలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పోటీ బీజేపీతో కాదని టీఆర్ఎస్ తో నేనని మరోసారి కుండ బద్దలు కొట్టారు.
పార్టీ పరంగా ఎవరైనా సరే పరిమితులకు లోబడి మాట్లాడాలని , పార్టీ కోసం పని చేయాలని సూచించారు. రాబోయేది తెలంగాణలో కాంగ్రెస పార్టీయేనని జోష్యం చెప్పారు రాహుల్ గాంధీ(Rahul Gandhi).
తెలంగాణ ప్రజలను మోసం చేసిన కేసీఆర్ ను ప్రజలు క్షమించరన్నారు రాహుల్ గాంధీ.
Also Read : Rahul Gandhi : కేసీఆర్ పై రాహుల్ గాంధీ ఫైర్