Rahul Gandhi : హైదరాబాద్ – ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారిని ఆదుకునే బాధ్యత తమపై ఉందని స్పష్టం చేశారు ఏఐసీసీ మాజీ చీఫ్, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi). ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తమ పార్టీ తరపున జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన మాజీ భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహమ్మద్ అజహరుద్దీన్ కు మద్దతుగా ప్రచారం చేపట్టారు. అంతకు ముందు ఆటో డ్రైవర్లతో కలిసి సమావేశం చేపట్టారు. ఈ సందర్బంగా తను కూడా ఆటో డ్రైవర్ కు చెందిన డ్రెస్ వేసుకున్నారు.
Rahul Gandhi Meet Auto Drivers
తమ పార్టీ ముందస్తుగా ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు. అంతే కాకుండా ఆటో డ్రైవర్లకు అండగా ఉంటామని చెప్పారు. రూ. 12 వేలను అందజేస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్బంగా జరిగిన సమావేశంలో ప్రధాన మంత్రిపై నిప్పులు చెరిగారు. తనపై కావాలని పదే పదే కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. అయినా తాను వెను దిరిగే ప్రసక్తి లేదన్నారు.
తాను మోడీతో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదన్నారు. నాపై పరువు నష్టం కూడా వేశారని ఆవేదన చెందారు. నా లోక్ సభ సభ్యత్వం కూడా రద్దు చేశారని అయినా తాను బెదర లేదన్నారు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ నేతలపై ఈడీ, సీబీఐలతో దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. మా ఓట్లను చీల్చేందుకు ఎంఐఎం ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ , బీజేపీ, ఎంఐఎం ఒక్కటేనని సంచలన కామెంట్స్ చేశారు.
Also Read : Lagadapati Rajagopal : లగడపాటి సర్వేలో గులాబీదే గెలుపు