Rahul Gandhi : మోదీపై యుద్దం దేశం కోసం పోరాటం
ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటాం
Rahul Gandhi Modi : ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మరోసారి ప్రధాన మంత్రి సారధ్యంలోని భారతీయ జనతా పార్టీ సంకీర్ణ సర్కార్ సాగిస్తున్న పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వ వ్యవస్థలను నిర్వీర్యం చేసి ప్రజాస్వామ్యానికి పాతర వేశారంటూ ఆరోపించారు రాహుల్ గాంధీ(Rahul Gandhi Modi).
అంతకు ముందు రాహుల్ గాంధీతో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, బీహార్ సీఎం నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ , ఆర్జేడీ ఎంపీతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సల్మాన్ ఖుర్షీద్ పాల్గొన్నారు. భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉందని, ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ తరుణంలో దేశంలోని అన్ని ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. భావసారూప్యత కలిగిన పార్టీలు, వ్యక్తులు, సంస్థలతో కలిసి ముందుకు వెళతామని స్పష్టం చేశారు కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ(Rahul Gandhi).
ప్రధానంగా తమ ముందున్న ప్రధాన లక్ష్యం ఒక్కటే . ప్రతిపక్షాలను ఏకం చేయడం. ఆ దిశగా అడుగులు పడ్డాయని చెప్పారు. దేశం పట్ల వారికి ఉన్న విజన్ ను అభివృద్ది చేస్తామన్నారు రాహుల్ గాంధీ.
Also Read : ప్రతిపక్షాల సమావేశం చరిత్రాత్మకం