Rahul Gandhi : స‌త్యం ప‌లక‌డం దేశ ద్రోహం కాదు

ప్ర‌శ్నించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ

Rahul Gandhi : దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారిన దేశ ద్రోహం కేసుపై సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. తాము అంతిమ తీర్పు చెప్పేంత వ‌ర‌కు కేసులు న‌మోదు చేయ‌వ‌ద్దంటూ స్ప‌ష్టం చేసింది.

అంతే కాకుండా ఒక‌వేళ చేసినా బాధితులు, అభియోగాలు మోపిన వారు స్వ‌చ్చందంగా కోర్టును ఆశ్ర‌యించ‌వ‌చ్చ‌ని పేర్కొంది ధ‌ర్మాస‌నం. అంతే కాకుండా రాజ ద్రోహం చ‌ట్టం అమ‌లుపై స్టే విధించింది.

ఈ చ‌ట్టం దుర్వినియోగం అవుతోందంటూ దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌లు , అభ్యంత‌రాలు వ్య‌క్తం అవుతున్నాయి. దీనిపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిర‌ణ్ రిజిజు స్పందించారు.

కోర్టులంటే త‌మ‌కు గౌర‌వం ఉంద‌ని కానీ ల‌క్ష్మ‌ణ రేఖ ఒక‌టి ఉంద‌నేది మ‌రిచి పోకూడ‌ద‌న్నారు. ఇవాళ స్టే విధించ‌డాన్ని స్వాగ‌తించారు కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు, వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi).

ఈ సంద‌ర్భ‌గా ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌శ్నించ‌డం నేరం ఎలా అవుతుంద‌ని, స‌త్యం ప‌లికితే దేశ ద్రోహం ఎలా అవుతుందంటూ ప్ర‌శ్నించారు. నిజం మాట్లాడ‌టం అంటే దేశ భ‌క్తి ఉన్న‌ట్టేన‌ని పేర్కొన్నారు.

వాస్త‌వం మాట్లాడితే ఎంత మాత్రం దేశ ద్రోహం కానే కాద‌న్నారు రాహుల్ గాంధీ(Rahul Gandhi). ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. భార‌త దేశ స‌ర్వోన్న‌త న్యాయ స్థానం స్టే ఇవ్వ‌డాన్ని ఆయ‌న స్వాగ‌తించారు.

ఈ సంద‌ర్బంగా జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ చేసిన కామెంట్స్ కూడా ప్ర‌స్తావించారు. దేశానికి స్వాతంత్రం వ‌చ్చి 75 ఏళ్లు అవుతున్నా నేటికీ దేశ ద్రోహం చ‌ట్టం అమ‌లు కావ‌డం ఏంటి అంటూ నిల‌దీశారు.

స‌త్యాన్ని విన‌డం రాజ ధ‌ర్మం. అణిచి వేయ‌డం మాత్రం అహంకారం అంటూ నిప్పులు చెరిగారు రాహుల్ గాంధీ.

 

Also Read : ఐఏఎస్ అధికారి పూజా సింఘాల్ అరెస్ట్

Leave A Reply

Your Email Id will not be published!