Rahul Gandhi Passport : రాహుల్ పాస్ పోర్టు కేసుపై తీర్పు

ఎంపీగా అన‌ర్హ‌త వేటుతో ఇబ్బంది

Rahul Gandhi Passport : వాయ‌నాడు ఎంపీగా అన‌ర్హ‌త వేటు ప‌డిన త‌ర్వాత దౌత్య ప‌ర‌మైన పాస్ పోర్టును స‌రెండ‌ర్ చేశారు ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ(Rahul Gandhi). తాజాగా సాధార‌ణ పాస్ పోర్ట్ జారీకి నో ఆబ్జ‌క్ష‌న్ స‌ర్టిఫికెట్ కోరుతూ ద‌ర‌ఖాస్తు చేశారు. దీనికి సంబంధించిన కేసుపై ఇవాళ విచార‌ణ చేప‌ట్ట‌నుంది ఢిల్లీ కోర్టు. ఇదిలా ఉండ‌గా భార‌తీయ జ‌న‌తా పార్టీ నేత సుబ్ర‌మ‌ణ్య స్వామి ఫిర్యాదుదారుగా ఉన్న నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీ నిందితుడిగా ఉన్నారు.

అడిష‌న‌ల్ చీఫ్ మెట్రోపాలిట‌న్ మేజిస్ట్రేట్ వైభ‌వ్ మెహ‌తా శుక్ర‌వారం వాద‌న‌లు విన్న త‌ర్వాత ఆర్డ‌ర్ ను రిజ‌ర్వ్ చేశారు. ఈ స‌మ‌యంలో స్వామి ద‌ర‌ఖాస్తును వ్య‌తిరేకించారు. ఇది ఏ మెరిట్ లేనిద‌ని , పాస్ట్ పోర్ట్ ను ఒక ఏడాది మాత్ర‌మే జారీ చేసి పున‌రుద్ద‌రించాల‌ని పేర్కొన్నారు. ఇది ప్ర‌త్యేక కేసు. పాస్ పోర్ట్ ప‌దేళ్ల పాటు ఇవ్వ‌కూడ‌దు. త‌ప్పుగా అనిపిస్తోంద‌ని కోర్టుకు తెలిపారు. రాహుల్ గాంధీకి బ్రిటిష్ పౌర‌స‌త్వం ఉన్నందు వ‌ల్ల అత‌డి పౌర‌స‌త్వం ప్ర‌శ్నార్థ‌క‌మైంద‌ని సుబ్ర‌మ‌ణ్య స్వామి వాదించారు.

రాహుల్ గాంధీ త‌ర‌పు న్యాయ‌వాది త‌ర‌న్న‌మ్ చీమా వ్య‌తిరేకించారు. పౌర‌స‌త్వ స‌మ‌స్య‌ల‌పై క్రిమిన‌ల్ ప్రొసీడింగ్స్ ల‌ను కోరుతూ దాఖ‌లైన రెండు పిటిష‌న్ల‌ను ఇప్ప‌టికే ఉన్న‌త న్యాయ‌స్థానాలు కొట్టి వేశాయ‌ని కోర్టుకు విన్న‌వించారు. చాలా తీవ్ర‌మైన నేరాలు ఉన్న కేసుల‌లో వెసులుబాటు ఇచ్చిన‌ప్పుడు రాహుల్ గాంధీకి ఐదేళ్ల పాటు ఎందుకు ఇవ్వ‌కూడ‌ద‌ని ప్ర‌శ్నించారు. దీనిపై ప‌రిశీలించి పాస్ పోర్ట్ కు అనుమ‌తించాల‌ని కోరారు.

Also Read : Salman Khan Guards Push

 

Leave A Reply

Your Email Id will not be published!