Rahul Gandhi Sensation : రాహుల్ జోష్ రేవంత్ ఖుష్
కామారెడ్డిలో జనం బ్రహ్మరథం
Rahul Gandhi Sensation : కామారెడ్డి – తెలంగాణలో ఎక్కడ చూసినా కాంగ్రెస్ ఊపు కనిపిస్తోంది. యంగ్ అండ్ డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి ఫుల్ జోష్ లో ఉన్నారు. ఎక్కడికి వెళ్లినా జనం బ్రహ్మరథం పడుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర మంతటా జల్లెడ పడుతున్నారు. అన్ని వర్గాల ప్రజలు ఆదరిస్తున్నారు. ప్రత్యేకించి రాహుల్ గాంధీ పాల్గొనే సభలకు పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. ఈ సందర్భంగా సభల్లో బై బై కేసీఆర్ అన్న స్లోగన్ కు పెద్ద ఎత్తున జనం చప్పట్లతో హోరెత్తిస్తున్నారు.
Rahul Gandhi Sensation
కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ తరపున టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ సాక్షాత్తు సీఎం కేసీఆర్ బరిలో ఉండడం విశేషం. ఇక్కడ షబ్బీర్ అలీకి పట్టుంది. ఈ సందర్బంగా రాహుల్ గాంధీ(Rahul Gandhi) హాజరై ప్రసంగించారు. కేసీఆర్ సర్కార్ పై నిప్పులు చెరిగారు. 40 ఏళ్లుగా గుర్తుకు రాని తన తల్లి గారి గూరు ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు.
ఏనాడూ గల్ఫ్ కార్మికుల గోసల గురించి పట్టించుకున్నారా అని నిలదీశారు. వారి కుటుంబాలను ఆదుకున్నారా అని మండిపడ్డారు. గజ్వేల్ లో , తెలంగాణలో ప్రభుత్వ భూములను దిగ మింగిండు..ఇప్పుడు కామారెడ్డిపై కన్నేసిండంటూ మండిపడ్డారు రాహుల్ గాంధీ. మొత్తంగా రాహుల్ గాంధీ ఫుల్ జోష్ లో ఉన్నారు. త్వరలోనే తమ సర్కార్ అధికారంలోకి రాబోతోందన్నారు.
Also Read : Telangana Congress Viral : బై బై కేసీఆర్..స్లోగన్ వైరల్