Rahul Gandhi : ఎన్నికల ఫలితాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ గురువారం నాడు ఆంధ్రభవన్ వచ్చారు. అక్కడ అటు, ఇటు కలియ తిరిగారు....

Rahul Gandhi : లోక్ సభ ఎన్నికల్లో విజయంపై ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మూడోసారి అధికారం చేపడుతామని ఎన్డీఏ కూటమి ఆశాభావంతో ఉంది. లేదు.. తమ కూటమికి ప్రజలు పట్టం కడతారని ఇండియా కూటమి అంటోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) సంచలన వ్యాఖ్యలు చేశారు. జూన్ 4వ తేదీన ఆశ్చర్యకర ఫలితాలు రాబోతున్నాయని ఆయన వివరించారు. ఇండియా ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం కూటమి అంటున్నారు. ఢిల్లీలో ఉన్న 7 లోక్ సభను కూటమి గెలుచుకుందని స్పష్టం చేశారు.

Rahul Gandhi Slams

రాహుల్ గాంధీ గురువారం నాడు ఆంధ్రభవన్ వచ్చారు. అక్కడ అటు, ఇటు కలియ తిరిగారు. అనంతరం ఆంధ్ర క్యాంటీన్‌లో భోజనం చేశారు. తర్వాత మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, బీజేపీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. భారత రాజ్యాంగం మార్చాలని బీజేపీ అనుకుంటుందని సందేహం వ్యక్తం చేశారు. రిజర్వేషన్ల అంశం తెరపైకి తీసుకొచ్చారని రాహుల్ గాంధీ. రిజర్వేషన్లను రద్దు చేస్తారని స్పష్టం చేశారు. దేశంలో తొంభై శాతం మంది పేదలు ఉన్నారని రాహుల్ గుర్తుచేశారు. దేశంలో ఏం జరుగుతుందో జనాలు గమనిస్తున్నారని రాహుల్ గాంధీ చెప్పారు. తమ వజ్రాయుధం అయిన ఓటుతో తగిన బుద్ది చెప్పాలని విశ్వాసంతో ఉన్నారు. దేశ సంపదను తన కోవర్టులకు ప్రధాని మోదీ దోచి పెడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. దేశ సంపద అదానీ, అంబానీ చేతిలో కేంద్రీకృతమైందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Also Read : CM Revanth Reddy : బౌద్ధ బిక్షులకు ప్రత్యేక గౌరవం ఇస్తామంటున్న తెలంగాణ సీఎం రేవంత్

Leave A Reply

Your Email Id will not be published!