Rahul Gandhi : బీజేపీ స‌ర్కార్ అవినీతికి కేరాఫ్ – రాహుల్

ఏఐసీసీ మాజీ చీఫ్ సంచ‌ల‌న కామెంట్స్

Rahul Gandhi : ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. క‌ర్ణాట‌క‌లో ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా మంగ‌ళ‌వారం దావ‌ణ‌గెరెలో ఏర్పాటు చేసిన బహిరంగ స‌భ‌లో ప్ర‌సంగించారు. గ‌తంలో ప్ర‌జ‌ల‌కు జ‌వాబుదారీగా ఉండేద‌ని కానీ భార‌తీయ జ‌న‌తా పార్టీ వ‌చ్చాక ప‌క్క‌దారి ప‌ట్టింద‌ని ఆరోపించారు. 24 గంట‌ల పాటు ఉచితంగా తారు నీరును అంద‌జేస్తామ‌ని గ‌త ఎన్నిక‌ల్లో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ(PM Modi) హామీ ఇచ్చార‌ని గుర్తు చేశారు రాహుల్ గాంధీ.

మ‌రి ఎందుకు నెర‌వేర్చ‌లేక పోయారో ప్ర‌జ‌ల‌కు చెప్పాల‌ని డిమాండ్ చేశారు. మాయ మాట‌లు చెప్ప‌డం, అవినీతి ప‌రుల‌కు వంత పాడ‌టం ప‌నిగా పెట్టుకున్నారంటూ మండిప‌డ్డారు. రాష్ట్రంలో ప్ర‌భుత్వం అనేది ఉందా అన్న అనుమానం క‌లుగుతోంద‌న్నారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించుకునే నాథుడే క‌రువ‌య్యాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు. 40 శాతం క‌మీష‌న్ చెల్లిస్తేనే ప‌నులు చేసే స్థాయికి బీజేపీ బొమ్మై స‌ర్కార్ దిగ జారింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

దావ‌ణ‌గెరె హ‌రి హ‌ర్ డెవ‌ల‌ప్మెంట్ అథారిటీలో బీజేపీ ఎంత అవినీతి చేసింద‌ని ప్ర‌శ్నించారు. 700 ఇళ్లు ఇస్తామ‌ని హామీ ఇచ్చార‌ని , ఇప్ప‌టి దాకా భూమిని ఎందుకు కొనుగోలు చేయ‌లేక పోయారంటూ మండిప‌డ్డారు రాహుల్ గాంధీ(Rahul Gandhi). ఇక్క‌డ విలువైన రైతుల భూములు లాక్కున్నార‌ని ఆవేద‌న చెందారు.

Also Read : చిత్ర‌దుర్గ‌లో డ‌ప్పు కొట్టిన మోదీ

Leave A Reply

Your Email Id will not be published!