Rahul Gandhi T Shirt : టీ షర్ట్ పై రాహుల్ కామెంట్స్
హాట్ టాపిక్ గా మారిన నేత
Rahul Gandhi T Shirt : భారత్ జోడో యాత్రతో ఇప్పుడు దేశ మంతటా హాట్ టాపిక్ గా మారారు కాంగ్రెస్ యువ నేత , వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ. ఇప్పటి వరకు తొమ్మిది రాష్ట్రాలలో పూర్తి చేశారు. కన్యాకుమారి నుంచి మొదలైన ఈ యాత్ర కాశ్మీర్ దాకా సాగనుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 6న తమిళనాడు నుంచి యాత్రకు శ్రీకారం చుట్టారు.
ఇప్పటి దాకా తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్ , రాజస్థాన్ , హర్యానా పూర్తయింది. ఢిల్లీలో రెడ్ ఫోర్డ్ వేదికగా ప్రసంగించారు. తిరిగి జనవరి 3 నుంచి భారత్ జోడో యాత్ర ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా బుధవారం ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.
ఆయన ఓ వైపు చలి పెడుతున్నా లెక్క చేయకుండా యాత్ర కొనసాగిస్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 138వ వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
అయితే మొత్తం కార్యక్రమంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు రాహుల్ గాంధీ. ఆయన ధరిస్తున్న టీ షర్ట్ పై(Rahul Gandhi T Shirt) అందరి కన్ను పడింది. కొందరు దాని ధర భారీగానే ఉంటుందని పేర్కొనడం విమర్శలకు దారి తీసింది. ఓ జర్నలిస్ట్ ఈ టీ షర్ట్ ధరించడం వెనుక మర్మం ఏంటి అంటూ ప్రశ్నించారు.
దీనికి దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చారు రాహుల్ గాంధీ. ప్రస్తుతం టీ షర్ట్ ల కాలం నడుస్తోంది. అది నడిచినంత కాలం ధరిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు.
Also Read : అరుదైన చరిత్ర కాంగ్రెస్ ఘనత