Rahul Gandhi : హిందూత్వం పేరుతో రాజకీయం
మండిపడ్డ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ
Rahul Gandhi : కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూత్వం పేరుతో రాజకీయం చేస్తున్నారంటూ ఆరోపించారు. తామే సిసలైన భారతీయులం అంటూ కొందరు పేర్కొంటున్నారని అది పూర్తిగా తప్పు అని పేర్కొన్నారు.
ఏది జాతీయ వాదమో, ఏది హిందూత్వ వాదమో, ఎవరు హిందువో ఈరోజు వరకు క్లారిటీ ఇవ్వలేని స్థితిలో భారతీయ జనతా పార్టీ ఉందన్నారు.
ప్రధాని మోదీ దేశ జనాభాలోని అన్ని ప్రాంతాలను కలుపుకొని ఒక విజన్ ను రూపొందిస్తున్నారని, ఇది అన్యాయమైనదని మండిపడ్డారు రాహుల్ గాంధీ(Rahul Gandhi).
భారత దేశ ఆలోచనకు పూర్తి విరుద్దంగా ఉందన్నారు. వాళ్లు మతాన్ని అభ్యసించారు. కానీ హిందూ జాతీయ వాదుల గురించి ఏ మాత్రం అర్థం చేసుకోలేక పోయారని ఎద్దేవా చేశారు.
యూకే లోని కేంబ్రిడ్జి యూనివర్శిటీలోని కార్పస్ క్రిస్టీ కాలేజీలో జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడారు. కేంద్ర సర్కార్ అనుసరిస్తున్న విధానాలపైన, హిందూత్వంపైన ప్రశ్నించే వ్యక్తులు, సంస్థలపై క్రమబద్దమైన దాడి జరుగుతోందంటూ ఆరోపించారు రాహుల్ గాంధీ.
హిందూ జాతయ వాదం, కాంగ్రెస్ పార్టీలో గాంధీ కుటుంబం పాత్ర, ప్రజలను సమీకరించే ప్రయత్నాల నుండి విస్తృత శ్రేణి విషయాలపై రాహుల్ గాంధీ ప్రసంగించారు.
ఈ సందర్భంగా అనేక అంశాలపై విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ప్రజల ప్రస్తావన లేకుండా విజన్ ఎలా తయారు చేస్తారంటూ ప్రశ్నించారు.
ఇక భారత దేశంలో మీడియా ప్రధాన అంశాలను 30 సెకన్ల కంటే ఎక్కువ చూపించడం లేదని ధ్వజమెత్తారు. ఇది డెమోక్రసీని అవమానించడం తప్ప మరొకటి కాదన్నారు రాహుల్ గాంధీ(Rahul Gandhi).
Also Read : కాంగ్రెస్ టాస్క్ ఫోర్స్ 2024 డిక్లేర్