Rahul Gandhi Modi : రేప్ నిందితుల‌కు బీజేపీ మ‌ద్ద‌తు – రాహుల్

మోదీ సిగ్గు అనిపించ‌డం లేదా

Rahul Gandhi Modi : రాహుల్ గాంధీ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. బిల్కిస్ బానో కేసులో దోషులుగా ఉన్న వారంద‌రినీ భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌భుత్వం విడుద‌ల చేయ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు.

ఇందుకు సిగ్గు అని పించ‌డం లేదా అని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీని నేరుగా ప్ర‌శ్నించారు రాహుల్ గాంధీ. 2002 లో బిల్కిస్ బానో సామూహిక అత్యాచారానికి గురైంది.

ఆనాడు ఆమె 5 నెల‌ల గ‌ర్భ‌వ‌తి. బిల్కిస్ బానో క‌ళ్ల ముందే త‌మ వారిని హ‌త్య చేశారు. వారిని జైలు నుంచి విడుదల చేసింది.

ఈ సంద‌ర్భంగా మోదీ హ‌యాంలో దేశంలోని యూపీకి చెందిన ఉన్నావ్ , హ‌త్రాస్ , జ‌మ్మూ , కాశ్మీర్ లోని క‌థువా, గుజరాత్ లోని రేప్ కేసుల‌ను ఈ సంద‌ర్బంగా ఉద‌హ‌రించారు కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు.

నేర‌స్థుల‌కు బీజేపీ మ‌ద్ద‌తు ఇవ్వ‌డం తో మ‌హిళ‌ల ప‌ట్ల ఎలాంటి మ‌న‌స్త‌త్వాన్ని సూచిస్తోందో తెలుస్తుంద‌న్నారు. ఈ విష‌యంపై ఎందుకు నోరు విప్ప‌డం లేదంటూ ప్ర‌శ్నించారు.

క‌నీసం బాధ అనిపించ‌డం లేదా అని నిల‌దీశారు రాహుల్ గాంధీ(Rahul Gandhi) . ఉన్నావ్ బీజేపీ ఎమ్మెల్యేను ర‌క్షించేందుకు ప‌ని చేసింది. క‌తువా రేపిస్టుల‌కు అనుకూలంగా ర్యాలీ చేప‌ట్టారు.

ఇక హ‌త్రాస్ లో రేపిస్టుల‌కు అనుకూలంగా స‌ర్కార్ నిలిచింది. గుజ‌రాత్ రేపిస్టుల విడుద‌ల‌కు క్లియ‌రెన్స్ ఇచ్చింది. వారికి మ‌రింత నేరాలు చేసేందుకు ఓకే చెప్పిందంటూ ఆరోపించారు.

ఇలాంటి అసాంఘిక కార్య‌క్ర‌మాల‌కు బీజేపీ స‌ర్కార్లు కేరాఫ్ గా మారాయంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు రాహుల్ గాంధీ. గురువారం కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ ట్వీట్ చేశారు. ఆయ‌న చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి.

Also Read : దేశ రాజ‌కీయ‌ల‌పై ‘ఆప్’ ఫోక‌స్

Leave A Reply

Your Email Id will not be published!